E-Paper
Advertisement

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!
Advertisement

Medak: సినిమా సీన్‌ని తలపించేలా నడిరోడ్డుపై ఒక నూతన వధువును సొంత కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేసిన ఘటన మెదక్ జిల్లాలో కలకలం రేపింది. ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రణయ్ అనే యువకుడు, అదే ప్రాంతానికి చెందిన యువతి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలను ఎదిరించి ఈ నెల 6న ప్రేమ వివాహం చేసుకున్నారు. రక్షణ కోసం వారు పోలీసులను ఆశ్రయించగా, స్టేషన్‌లో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు.

Advertisement

అయితే అంతా సర్దుకుందనుకునే లోపే, అమ్మాయి బంధువులు నాలుగు కార్లలో వచ్చి లాఠీలతో బీభత్సం సృష్టించారు. ప్రణయ్ ఇంటిపై దాడి చేసి, నూతన వధువును బలవంతంగా కారులో ఎక్కించుకుని పరారయ్యారు. కౌన్సిలింగ్ జరిగిన రోజే ఇంత జరిగినా పోలీసులు సకాలంలో స్పందించడం లేదని వరుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భార్య ప్రాణాలకు ముప్పు ఉందని, ఎలాగైనా కాపాడాలంటూ ప్రణయ్ కన్నీరుమున్నీరవుతున్నాడు.

Related News

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

Big Stories

Advertisement
×