YSRCP Arrests: ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అరెస్ట్‌ల చుట్టే తిరుగుతున్నాయ్. వైసీపీ నేతల వరుస అరెస్ట్‌లు రాజకీయ దుమారం రేపుతున్నాయ్. సీదిరి అప్పలరాజు ఎపిసోడ్ సెగలు చల్లారకముందే ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్ సెన్సేషన్‌గా మారింది. సంగాల, నేమకల్లులో టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కొడుకు చంద్రశేఖర్ సహా 15 మందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఇది అరాచకానికి పరాకాష్ట అని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. దళిత కుటుంబాలపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోవాలా అంటూ టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఈ అరెస్ట్‌ల సిరీస్‌తో ఆంధ్రా ఇప్పటికే హీటెక్కింది. ఇకపైనా ఇదిలాగే కొనసాగితే ఆ హీట్ డబుల్ అవుతుంది. దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఎవ్వరూ ఊహించలేరు. ఏపీలో ఏ పార్టీ కంట్రోల్డ్‌గా లేకపోయినా ఆంధ్రా రాజకీయం కంట్రోల్ తప్పుతుంది. పరస్పర దాడులు, దౌర్జన్యాలు, అరెస్ట్‌లు ఇలాగే కొనసాగితే ఏపీలో పొలిటికల్ బరస్ట్ ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయ్.