Chamala Kiran Kumar Reddy: హైడ్రాను భూతంలా చూపించే యత్నం చేస్తున్నారు కేటీఆర్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. చెరువులు నాలాలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు సీఎం రేవంత్ హైడ్రాను తీసుకొచ్చారనీ.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి హైడ్రాను తప్పుగా చూపించేయత్నం లో కేటీఆర్ ఉన్నట్టు కనిపిస్తోందని అన్నారు చామల. కేటీఆర్ హైడ్రాపై ఇచ్చిన ప్రెజంటేషన్ పై స్పందించిన చామల.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అడ్డగోలు పర్మిషన్లే ప్రధాన కారణంగా చెప్పారు ఎంపీ చామల.