Bangalore: రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయితే మనం సరిగ్గా వెళ్తున్నా కూడా వెనక నుంచో పక్క నుంచో దూసుకొచ్చే వాళ్లు చాలా మంది ఉంటారు. అలా ప్రాణాలు కోల్పోయిన వారి ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఘటనే బెంగళూరు కేఆర్ పురంలో చోటుచేసుకుంది. కేఆర్ పురంలోని ఫ్లై ఓవర్ పై ఒక బైక్ పై ఇద్దరు ప్రయాణిస్తున్నారు. సరిగ్గా ఫ్లె ఓవర్ పై కరువు తిరిగే సమయంలో ఒక క్యాబ్ బైక్ కు దగ్గరగా వచ్చింది. దీంతో ఆ బైకర్ కార్ డ్రైవర్‌కు ట్రాఫిక్ నేవిగేట్ చేసినందుకు కారు దగ్గరకు వెళ్లాడు. క్యాబ్ డ్రైవర్‌తో తమకు దగ్గరగా దూసుకు వస్తే ఎలాగని వాదించాడు. దీంతో ఆగ్రహానికి గురైన క్యాబ్ డ్రైవర్ కారుతో ఉద్దేశపూర్వకంగా బైకర్ ను ఢీ కొట్టాడు. ఒక్కసారిగా ఢీ కొట్టడంతో బైకర్ అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ ను తాకింది. దీంతో వెనుక కూర్చొన్న వ్యక్తి కింద పడిపోయాడు. అతనికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తుంది.