Students Protest: జాతీయ రహదారి పై గురుకులం విద్యార్థినులు మెరుపు ధర్నాకు దిగారు. షాద్‌నగర్ జాతీయ రహదారిపై నిరసనలు చేపట్టారు. గురుకులంలో అక్రమాలు ఆపండి..ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రిన్సిపల్ శైలజ తీరుకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్నారు. దీనిలో మరి కొందరు టీచర్స్ ఉన్నారు.. వారిని కూడా సస్పెండ్ చేయాల్సిందే అంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిధులు సొంతానికి వాడుకుంటుందని .. ప్రిన్సిపల్ తమను వేధిస్తుందని ఆరోపిస్తున్నారు. కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు స్టూడెంట్స్. ఆందోళన చేస్తున్న కొందరు విద్యార్థులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు.