AP Welfare Calendar: ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు కొత్త ట్రాక్ రెడీ అవుతోంది. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు.. ఏ పథకం, ఏ వర్గానికి, ఏ తేదీన అందుతుందో ముందుగానే ప్రజలకు తెలిసేలా సంక్షేమ క్యాలెండర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. సూపర్-6 పథకాల అమలుతో పాటు జిల్లాల స్థాయిలో పురోగతిని పర్యవేక్షించాలని కలెక్టర్లకు చెప్పారు. ఇప్పటివరకు పింఛన్లు వంటి కొన్ని పథకాలకు నిర్దిష్ట చెల్లింపు షెడ్యూల్ ఉన్నా.. ఇక మొత్తం సంక్షేమ వ్యవస్థను ఒకే టైమ్‌లైన్‌లోకి తీసుకురావాలన్నదే ఈ ఆలోచన. రాజకీయంగా చూస్తే.. ఇది మరో కీలక సందేశం. హామీ ఇచ్చాం.. అమలు చేస్తాం.. ఎప్పుడు ఇస్తామో కూడా చెబుతాం అన్న పాయింట్ ను బలపరచడమే లక్ష్యంగా కనిపిస్తోంది. గతంలో వైసీపీ కూడా బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలెండర్ ప్రకటించామని చెబుతోంది. మరి కొత్త క్యాలెండర్ నిజంగా అధికారులపై బాధ్యత పెంచుతుందా? ప్రజలకు ముందస్తు స్పష్టత ఇస్తుందా? లేక రాజకీయంగా సూపర్-6 బ్రాండింగ్‌కు మరో ఆయుధమా?