E-Paper
Advertisement

సర్వే సమరం.. ప్రజలు ఎవరివైపు..?

సర్వే సమరం.. ప్రజలు ఎవరివైపు..?
Advertisement

Telangana Survey: తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పార్టీల సర్వేల మధ్య సమరం మొదలైనట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ.. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నాలు జోరందుకున్నాయ్. తాజాగా ఓ సర్వే ప్రకారం.. 41.1 శాతం మంది రేవంత్ పాలన మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పొలిటికల్ అప్రోచ్ ఎలా ఉందన్న ప్రశ్నకు 63.5 శాతం మంది సానుకూలంగా స్పందించారంటున్నారు. అదే సమయంలో ఓ ప్రధాన రాజకీయ పార్టీ చేయించిన అంతర్గత సర్వేలో ఆ పార్టీకి షాక్ ఇచ్చే ఫలితాలు వచ్చాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. మరి ఈ సర్వేలు నిజంగా ప్రజల నాడిని పట్టుకుంటున్నాయా..? లేక భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు దిశానిర్దేశం చేసేందుకేనా..? వెయ్యి రోజుల పాలనపై ప్రజల ఫీడ్‌బ్యాక్ తీసుకుని అవసరమైతే పాలనలో మార్పులు చేర్పులు చేసుకునే ప్లాన్ లో కాంగ్రెస్ ఉంది. మరోవైపు ఎన్నికల సమరానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే ప్లాన్ కూడా పొలిటికల్ పార్టీల్లో కనిపిస్తోంది. అసలు సర్వేల సమరం దేనికి సంకేతం?

Tags

Related News

తెగిపడిన పోతిరెడ్డిపాడు గేట్.. జలపోరు మళ్లీ షురూ!

బాబు మార్క్ పాలన.. ముందుగానే ప్రజలకు సంక్షేమ క్యాలెండర్!

జనసేనలోకి బడా నేతలకు దారేది?

ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న 1980 ట్రెండ్..

వర్గీకరణ తర్వాత MRPS కీలక నిర్ణయం.. కొత్త పోరాటానికి రెడీ?

నెల్లూరులో మైనింగ్ వార్..!

డీఎస్సీపై ఢీ.. జగన్ ప్రశ్నలకు బాబు రియాక్షన్ ఏంటి?

Big Stories

Advertisement
×