E-Paper
Advertisement

సెక్రటీరియట్‌లో లంచావతారాలు..!

సెక్రటీరియట్‌లో లంచావతారాలు..!
Advertisement

Secretariat Bribery: సెక్రటేరియట్‌లోనే లంచావతారం బయటపడింది. CMRF కింద మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ ప్రాసెస్‌ చేసేందుకు 1 లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు ACBకి చిక్కారు. సెక్రటేరియట్‌ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాఘవేందర్‌, TSIDC సీనియర్‌ అసిస్టెంట్‌ వినోద్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది ACB. అంతకుముందే 5 వేలు ఫోన్‌పే ద్వారా తీసుకున్నారన్నది ACB ఆరోపణ. CMRF అంటే అత్యవసర వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అందించే సాయం. అలాంటి ఫైల్‌ కదిలించేందుకే లంచం అడిగితే.. ఇక మిగితా వాటి సంగతి చెప్పక్కర్లేదు. అటు ACB ఇలాంటి వారిని వరుసగా ట్రాప్‌లు వేస్తోంది. 2025లో తెలంగాణ ACB 199 కేసులు నమోదు చేసి 273 మందిని అరెస్ట్‌ చేసినట్టు లెక్కలున్నాయి. పట్టుకోవడం వరకు బాగానే ఉన్నా.. ఇలా అవినీతి చేసే వారికి శిక్ష పడే వేగం, ఆస్తుల జప్తు, ఉద్యోగం విషయంలో వెంటనే కఠిన ప్రభావం ఉండేలా చర్యలు అవసరమన్న వాదనైతే ఉంది.

Tags

Related News

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

22A భూములపై పొలిటికల్‌ వార్‌..!

తెగిపడిన పోతిరెడ్డిపాడు గేట్.. జలపోరు మళ్లీ షురూ!

బాబు మార్క్ పాలన.. ముందుగానే ప్రజలకు సంక్షేమ క్యాలెండర్!

సర్వే సమరం.. ప్రజలు ఎవరివైపు..?

జనసేనలోకి బడా నేతలకు దారేది?

Big Stories

Advertisement
×