E-Paper
Advertisement

22A భూములపై పొలిటికల్‌ వార్‌..!

22A భూములపై పొలిటికల్‌ వార్‌..!
Advertisement

22A Land Row: తెలంగాణలో 22A భూముల వివాదం డైలీ సీరియల్ లా కొనసాగుతూనే ఉంది. బీఆర్‌ఎస్‌ హయాంలో 22A జాబితాలో ఉన్న భూములు సుమారు 16 లక్షల ఎకరాలేనని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అవి భారీగా పెరిగాయని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. హరీశ్‌రావు కూడా కాంగ్రెస్‌ వచ్చాకే పట్టా భూములను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్‌ ఉంది. 2007లోనే నిషేధిత భూముల జాబితా విధానం వచ్చింది. అయితే 2017–18 భూ రికార్డుల ప్రక్షాళన, 2020 ధరణి డిజిటలైజేషన్‌ సమయంలో పాత రికార్డుల లోపాలతో ప్రైవేట్‌ భూములు కూడా తప్పుగా 22Aలో చేరినట్టు రిపోర్టులు చెబుతున్నాయ్. అంటే సమస్యకు మూలం పాతదే.. ధరణి దాన్ని మరింత సంక్లిష్టం చేసిందా అన్నదే అసలు చర్చ. ఇక ప్రస్తుత ప్రభుత్వం కూడా తప్పులను సరిచేయాల్సిన పరిస్థితిలోనే ఉంది. హైకోర్టు ఆదేశాల తర్వాత ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.

Tags

Related News

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

సెక్రటీరియట్‌లో లంచావతారాలు..!

తెగిపడిన పోతిరెడ్డిపాడు గేట్.. జలపోరు మళ్లీ షురూ!

బాబు మార్క్ పాలన.. ముందుగానే ప్రజలకు సంక్షేమ క్యాలెండర్!

సర్వే సమరం.. ప్రజలు ఎవరివైపు..?

జనసేనలోకి బడా నేతలకు దారేది?

Big Stories

Advertisement
×