Manoj Mounika:న్యూఢిల్లీలోని హిమాచల్ సదన్‌లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తాను మనోజ్, మౌనిక దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. మాములుగా సినిమా సెలబ్రిటీలు రాష్ట్ర గవర్నర్‌ను లేదా ముఖ్యమంత్రిని కలిస్తే, అది తమ కొత్త సినిమా ప్రమోషన్ కోసమనే అనుకుంటారు. కానీ ఈ మీటింగ్ లో కేవలం సినిమా విషయాలే కాకుండా, స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా వీరు మాట్లాడినట్టు తెలుస్తోంది.
సరికొత్త ప్రయోగాలు చేయాలనే ఆలోచన
మంచు మనోజ్ కి మొదటి నుంచి డిఫరెంట్ సినిమాలతో, తనదైన మేకింగ్ శైలితో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా, సినిమా వెనుక ఉండే ప్రొడక్షన్, టెక్నికల్ విషయాలపై కూడా ఆయనకు మంచి పట్టు ఉందని చాలా సార్లు ప్రూవ్ అయింది కూడా. ఇప్పుడు కేవలం నటనకే పరిమితం కాకుండా, పరిశ్రమలో సరికొత్త ప్రయోగాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోంది.
మరోవైపు భూమా మౌనిక కూడా సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. దీంతో ఈ దంపతులిద్దరూ కలిసి సమాజానికి ఉపయోగపడే లేదా ఒక డిఫరెంట్ ఐడియాతో కూడిన పెద్ద ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ అంశాలపై కూడా గవర్నర్ తో మాట్లాడారా
ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది అక్కడి అందమైన లొకేషన్లు, అక్కడి పర్వతాలు. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు ఎన్నో అక్కడ షూటింగ్ జరుపుకుంటాయి కూడా. అయితే అక్కడ షూటింగ్ చేసుకునే వారికోసం మరింత డెవలప్ చేయడం , కొత్త స్టూడియోల ఏర్పాటు చేయడం, షూటింగ్ లొకేషన్లని డెవలప్ చేయడం,ఈవెంట్ స్పేస్ ప్రమోషన్ లాంటి అంశాలపై కూడా వీరు గవర్నర్ తో మాట్లాడారా అన్న టాక్ వినిపిస్తుంది.
ఏదైనా ప్రతిపాదన పెట్టారా
ఇక టాలీవుడ్ నుంచి అక్కడికి వెళ్లే ప్రొడక్షన్ హౌస్‌లకు సరైన సదుపాయాలు కల్పించే విధంగా ఏదైనా ప్రతిపాదన పెట్టారా అనేది కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. దీనికి తోడు స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పై ప్రత్యేకంగా ఫోకస్ చేయడం వెనుక మరో పెద్ద ప్లాన్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. క్రీడారంగంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ యూత్ కి
ఉపయోగపడేలా స్పోర్ట్స్ అకాడమీలు, ట్రైనింగ్ సెంటర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు నిర్మించే ఆలోచనలో ఏమైనా ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది. అయితే వీరు ఎందుకు కలిశారు అన్న విషయాలు ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు.
ALSO READ:ఈశ్వర్ సాయికి బెయిల్.. ఇక తప్పించుకున్నట్టేనా?
చూడాలి ముందు ముందు ఏమైనా రివీల్ చేస్తారేమో !