పోతిరెడ్డిపాడు 9వ గేట్.. నీటి విడుదల సమయంలో ఐరన్ రోప్ తెగిపోవడంతో గేట్ అదుపుతప్పిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. గేట్ కొట్టుకుపోవడానికి కారణం నీటి ప్రవాహ ఉధృతేనని అధికారులు చెబుతున్నా.. అసలు మెయింటెనెన్స్ ఎలా ఉంది? రోప్ కండిషన్‌ను ముందే ఎందుకు గుర్తించలేకపోయారు? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అసలు శ్రీశైలంలో ప్రస్తుతం 127 టీఎంసీలే నిల్వ ఉంది. 200 టీఎంసీలకు పైన ఉన్నప్పుడే 9, 10, 11 గేట్లను ఆపరేట్ చేస్తుంటారు. మరి తక్కువ నీళ్లు ఉన్నప్పుడు ఎందుకిలా చేశారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు, నీటి ఒత్తిడి పెరుగుతోంది. అలాంటి సమయంలో శ్రీశైలం నీటిని ఏపీ, తెలంగాణ మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పైగా శ్రీశైలం నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. మరి ఒక గేట్ వైఫల్యం కేవలం ఇంజినీరింగ్ సమస్యేనా.. లేక వాటర్ మేనేజ్‌మెంట్‌లో నిర్లక్ష్యానికి సంకేతమా?