Guntur: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌కి చెందిన 40 మంది భక్తులు బస్సు లో తీర్ధయాత్రకు బయలుదేరారు. అన్నవరంలో దైవ దర్శనం తరువాత నరసరావుపేట మీదుగా శ్రీశైలంకు ప్రయాణమయ్యారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సు అదుపు తప్పి మేరికిపూడి పంట కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా స్వల్ప గాయాలు అయ్యాయి. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టి, బాధితులను ఆస్పత్రికి తరలించారు.