Guntur: గుంటూరు లేడిస్ హాస్టల్ లో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. ఏలూరు గ్రామానికి చెందిన శ్రావ్య అనే యువతి గుంటూరులోని వివిఐటి ఇంజినీర్ కాలేజిలో చివరి సంవత్సరం చదువుతుంది. అశోక్ నగర్ లేడీస్ హాస్టల్ లో ఉంటుంది. రూమ్‌మేట్స్ రాత్రి పడుకోవడానికి పిలిచినపుడు.. తను పర్సనల్ కాల్ మాట్లాడుతున్నానని చెప్పింది. సరే అని వాళ్లు పడుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి శ్రావ్య ముక్కుకి క్లిప్, నోటికి ప్లాస్టర్‌తో చనిపోయి కనిపించింది. రూమ్‌మేట్స్ భయంతో వెంటనే హాస్టల్ వార్డన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.