Hyderabad: పుట్టిన రోజు ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. స్నేహితులు అతడి ప్రైవేట్ పార్ట్ మీద దాడి చేయడంతో ఆస్పత్రిపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న రిషాంత్ బర్త్‌డే సందర్భంగా తోటి విద్యార్థులు క్లాస్ రూమ్‌లో బర్త్‌డే చేశారు. ఆ తర్వాత బర్త్ డే బంప్స్ పేరుతో కాళ్లతో ఎక్కడ పడితే అక్కడ తన్నారు. దీంతో అతడి ప్రైవేట్ పార్ట్‌కు గాయమైంది. అక్కడ తీవ్రంగా రక్తస్రావం కావడంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థికి 3 నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కొడుకును గాయపరిచిన విద్యార్థులతోపాటు పాఠశాల యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.