E-Paper
Advertisement

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!
Advertisement

Metro Handover: రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత ట్రై చేసినా సరే.. మెట్రో విషయంలో కేంద్రంలో కదలిక లేదు. లేకపోగా కొత్త మెలిక పెట్టింది. మెట్రో ఫేజ్-1 స్వాధీనానికి అవసరమైన 13 వేల 600 కోట్ల రుణ సేకరణ బాధ్యతని మళ్లీ రాష్ట్రంపైనే మోపినట్లు తెలుస్తోంది. ఫేజ్-1 కోసం రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన జపాన్ IRFCని కాదని.. కేంద్రం ఎస్‌బీఐ క్యాప్స్‌కు బాధ్యత అప్పగించింది. ఇప్పటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. కేంద్రంతో చర్చల తర్వాత తెలంగాణ ప్రభుత్వం జయేశ్ రంజన్‌ని ప్రతినిధిగా నియమించింది. కేంద్రం, ఎస్‌బీఐ క్యాప్స్ మాత్రం ఇప్పటికీ తమ ప్రతినిధులను ప్రకటించలేదు. ఇప్పుడు కేంద్రం పెట్టిన మెలికతో మళ్లీ రుణం ఇచ్చే సంస్థల వైపు చూస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఎస్‌బీఐ, ఐసీఐసీఐతో పాటు మరికొన్ని బ్యాంకులను సంప్రదించనున్నట్లు సమాచారం. అప్పుడే IRFC రుణానికి కేంద్రం NOC ఇచ్చి ఉంటే మేలోనే మెట్రో తొలి దశని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉండేది. చివరిదశలో నిధులు నిలిచిపోవడంతో మెట్రో హ్యాండోవర్ ఆలస్యమవుతోంది. ఇలాగైతే.. మెట్రో ఫేజ్-1ని ప్రభుత్వం ఎప్పటికి స్వాధీనం చేసుకుంటుంది? రెండో దశ ఎప్పుడు మొదలుపెడుతుంది?

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×