Mokshagna Entry:“మోక్షజ్ఞా… ఎప్పుడొస్తావు? ఇదే ఇప్పుడు నందమూరి అభిమానుల నోట వినిపిస్తున్న ప్రశ్న.సోషల్ మీడియాలో కూడా ఇదే డైలాగ్ వైరల్ అవుతోంది. ఒకప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూసిన అభిమానులు… ఇప్పుడు “అక్క వస్తుందనే వార్తలు వస్తున్నాయి… మరి తమ్ముడు ఎక్కడ?” అంటూ సరదాగా సెటైర్లు వేస్తున్నారు.
గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా భారీ సినిమా వస్తుందని అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. “ఇదిగో వచ్చేశాడు నందమూరి వారసుడు” అంటూ సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఆ ప్రకటన తర్వాత నెలలు గడిచిపోయాయి. సినిమా మాత్రం ఇప్పటికీ సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో “సినిమా ఉందా… లేదా?” అనే సందేహం కూడా చాలామందిలో మొదలైంది.
ఇంకా లాంచ్‌కే రెడీ కాలేదా?
ఇంతలో మరో ట్విస్ట్. బాలకృష్ణ కుమార్తె తేజస్విని సినిమాల్లోకి వస్తున్నారనే ప్రచారం ఒక్కసారిగా ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టింది. కెమెరా వెనుక పనిచేసిన ఆమె ఇప్పుడు కెమెరా ముందుకు రాబోతున్నారనే వార్తలు రావడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. “అన్నీ సిద్ధమయ్యాకే వస్తుందేమో అక్క… కానీ తమ్ముడు మాత్రం ఇంకా లాంచ్‌కే రెడీ కాలేదా?” అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వేస్తున్నారు యాంటి ఫ్యాన్స్.
ఒక వైపు ఇండస్ట్రీలో తేజ సజ్జా, కిరణ్ అబ్బవరం వంటి హీరోలు దూసుకుపోతున్నారు. మరికొందరు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. అందుకే నెటిజన్లు “మోక్షజ్ఞా… కుర్ర హీరోలంతా దూసుకుపోతుంటే నువ్వు ఇంకా ముహూర్తం దగ్గరే ఉన్నావా?” అంటూ పోస్టులు పెడుతున్నారు.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ
తేజస్విని సినిమా గురించి వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆమె స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ప్రేక్షకుల ముందుకు రావొచ్చని అంటున్నారు. లేడీ ఓరియంటెడ్ కథను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినా ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి.
నిజానికి తేజస్విని ‘అన్‌స్టాపబుల్’ షోతో పాటు బాలకృష్ణ సినిమాలకు సంబంధించిన కొన్ని క్రియేటివ్ పార్ట్స్ లో ఆమె పాత్ర ఉందని గతంలోనే ప్రచారం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో ఆమె చేసిన డ్యాన్స్ వీడియోలు, ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ యాడ్ లు కూడా మంచి పేరే తెచ్చుకున్నాయి. దీంతో ఆమె నటిగా వస్తే ఎలా ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.
క్లారిటీ రావాలంటే వెయిట్ చేయాల్సిందే
అయితే మరోవైపు మోక్షజ్ఞ అభిమానులు మాత్రం తమ హీరో ఎంట్రీ గురించే ఎదురుచూస్తున్నారు. “ఫస్ట్ లుక్ ఎప్పుడు?”, “షూటింగ్ ఎప్పుడు?”, “రిలీజ్ ఎప్పుడు?” అంటూ వరుస ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. కొందరైతే “అక్క ఎంట్రీకి ముందు తమ్ముడు ఎంట్రీ ఉంటుందనుకున్నాం… కానీ ఇప్పుడు కథ రివర్స్ అయిపోయిందా?”*అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
also read :ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ప్రస్తుతం తేజస్విని ఎంట్రీ గురించిన వార్తలు, మోక్షజ్ఞ సినిమా ఆలస్యం… రెండూ అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు.సో క్లారిటీ రావాలంటే వెయిట్ చేయాల్సిందే.