Hyderabad: హైదరాబాద్ సిటీలో కొత్త దొంగల బ్యాచ్ కలకలం రేపుతుంది. కొత్తగా ఆటోలో వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు మహిళా దొంగల బ్యాచ్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ..దొంగతనానికి ప్రయత్నించారు.. ఐదుగురు మహిళా దొంగల బ్యాచ్. ఓ ఆటోలో వచ్చి నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించారు. అక్కడ ఏమీ దొరకకపోవడంతో మరో ఇంట్లోకి దొంగతనానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఇంటి యజమాని సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసుల సీసీటీవీ రికార్డ్‌ను పరిశీలించారు. ఆటో నెంబర్ ఆధారంతో దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.