Hetero Drugs Company: హెటిరో డ్రగ్ కంపెనీ పై సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామస్తులు, రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. ఇన్నాళ్లూ అధికారులకు అప్లికేషన్లు ఇచ్చిన రైతులు ఇక వారి నుండి ఎటువంటి పరిష్కారం లేకపోవడంతో రంగంలోకి దిగారు. తాడోపేడో తేల్చుకుంటామంటూ నిరసన ర్యాలీల పేరుతో రోడ్డెక్కారు. కంపెనీ మూసివేసేవరకు పోరాటం కొనసాగిస్తామంటూ తెలుపుతున్నారు. కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యాక్రమాలు చేపట్టారు. చెరువు కలుషితమవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామంటూ గ్రామస్తులు తెలిపారు. అంతే కాకుండా చెరువు కింద ఉన్న పంటలు నాశనం అవుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్టేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లకుంట చెరువులోకి రసాయనాలు వదలడం ఇకనైనా ఆపాలంటున్నారు.