E-Paper
Advertisement

స్పాట్ ఫిక్సింగ్ లో అంద‌రూ న‌న్ను బ‌లి చేశారు..2013 సంఘ‌ట‌న‌పై శ్రీశాంత్ సంచ‌ల‌నం !

స్పాట్ ఫిక్సింగ్ లో అంద‌రూ న‌న్ను బ‌లి చేశారు..2013 సంఘ‌ట‌న‌పై శ్రీశాంత్ సంచ‌ల‌నం !
Advertisement

Sreesanth On Spot-fixing: టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ (S. Sreesanth) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2013 ఐపీఎల్ సందర్భంగా జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ (Match-fixing) ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ.. అందరూ కలిసి తనను నిండా ముంచేసారని ఫైర్ అయ్యారు. 14 మంది తప్పు చేస్తే… తనను మాత్రమే ఇరికించారని సీరియస్ అయ్యారు. అందరూ కలిసి తనను ఈ కేసులో ఇరికించి తప్పుకున్నారని మండిపడ్డారు. అసలు ఈ సంఘటనకు కారణమైన 14 మంది ప్లేయర్ల పేర్లు లేకుండా రికార్డులు భూస్థాపితం చేశారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు శ్రీశాంత్.

స్పాట్ ఫిక్సింగ్ లో న‌న్ను మాత్ర‌మే ఇరికించారు

2013 ఐపీఎల్ ఫిక్సింగ్ సంఘటనపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు కేరళ స్టార్ బౌలర్ శ్రీశాంత్. తాను కేరళ నుంచి వచ్చాను అన్న ఒక్క కారణంతో… ఈ ఫిక్సింగ్ లో తనను మాత్రమే ఇరికించారని ఫైర్ అయ్యారు. 2013 సంవత్సరంలోనే ఎన్నికలు జరిగిన క్రమంలో… తనకు మద్దతుగా మాట్లాడడానికి ఎవరు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అందరూ కలిసి తనను ఈ ఫిక్సింగ్ కేసులో ఇరికించేసారని ఆరోపించారు. 2013 మే 9వ తేదీన ఆరోపణలు వస్తే.. అప్పుడు అరెస్టు చేయకుండా వారం రోజులు ఆగి తనను చిప్పకూడు తినేలా చేశారని నిప్పులు చెరిగారు శ్రీశాంత్.

14 మంది పేర్లు మాయం చేశారు

Advertisement

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణ సమయంలో 14 మంది క్రికెటర్ల పేర్లు బయటకు వచ్చాయని శ్రీకాంత్ తెలిపారు. కానీ సుప్రీంకోర్టు విచారణ జరుగుతున్న క్రమంలోనే వాళ్ల పేర్లు కంప్యూటర్ నుంచి ఫార్మాట్ చేశారని ఆరోపించారు. ఆ 14 మంది క్రికెటర్ల పేర్లు శాశ్వతంగా మాయమయ్యేలా చేశారని ఫైర్ అయ్యారు. దీంతో తానే బుక్ అయిపోయానని ఎమోషనల్ అయ్యారు. ఆ ఫిక్సింగ్ సమయంలో వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ అలాగే యువరాజ్ సింగ్ మాత్రమే తనకు మద్దతుగా నిలిచారని.. మిగిలిన క్రికెటర్లు తనను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.

అసలు 2013 స్పాట్ ఫిక్సింగ్ ఎలా జరిగింది ? సూత్రధారులు ఎవరు ?

2013 మే 16వ తేదీన స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ సహజరులు చండీలా, అంకిత్ చావాన్ అరెస్టయ్యారు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఓ మ్యాచ్ లో బుకీల‌ ఒప్పందం ప్రకారం ఒక ఓవర్ లో 14 పరుగులు ఇవ్వడానికి శ్రీశాంత్ అంగీకరించాడని అప్పట్లో తేలింది. దీని కోసం తన జేబులో తెల్లటి టవల్ పెట్టుకొని బుకీలకు సిగ్నల్ ఇచ్చాడని ఆరోపణలు వచ్చాయి. ప్లాన్ ప్రకారమే ఈ ఓవర్ లో ఏకంగా 13 పరుగులు ఇచ్చాడు శ్రీకాంత్. ఇక ఫిక్సింగ్ ఖరారైన నేపథ్యంలో శ్రీశాంత్ 2013లోనే జీవితకాలం పాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది బీసీసీఐ.

Advertisement

 

 

 

Related News

షేన్ వార్న్, మురళీధరన్ కంటే..స‌చిన్ బౌలింగ్ అత్యంత ప్ర‌మాదక‌రం

2023 ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియాను గెలిపించేందుకు కుట్ర‌లు చేశారు!

పాకిస్తాన్ ప‌రువు తీసిన శుభ్‌మన్ గిల్…అంద‌రూ క‌లిసి చేసిన ర‌న్స్ ఒక్క‌డే చేశాడుగా!

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !

పీక‌ల‌దాకా తాగుతూ నైట్ క్ల‌బ్ లో దొరికిన 9 మంది పాకిస్తాన్ క్రికెట‌ర్లు

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తా… బ్రెట్ లీకి షోయ‌బ్ అక్త‌ర్ స‌వాల్

నా చేత‌కాని త‌నం వ‌ల్లే.. ఆ క్యాచ్ నేల పాలైంది – మాలిక్

Big Stories

Advertisement
×