Inzamam Ul Haq beats Indian Spectator with Bat: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లను రెండు దేశాల మధ్య యుద్ధంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఇరు ప్లేయర్లు ఒకరినొకరు తిట్టుకోవడం… తన్నుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే గతంలో టీమిండియా అభిమానిని ( Team India Fan) పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ (Inzamam-ul-Haq) బ్యాట్ తో దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తాజాగా వసీం అక్రమ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆలుగడ్డ అంటూ నినాదాలు.. చేసిన తరుణంలో ఇంజమామ్ వుల్ హక్ దాడికి పాల్పడినట్లు చెప్పారు. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
1997లో కెనడాలోని ( Canada) టొరంటో ( Torrent) వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs. Pakistan) మధ్య చారిత్రాత్మక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఇంజమామ్ వుల్ హక్ (Inzamam-ul-Haq)ను టార్గెట్ చేసి ఓ భారత అభిమాని ట్రోల్ చేయడం మొదలు పెట్టాడు. ఇంజమామ్ వుల్ హక్ కాస్త లావుగా ఉన్న నేపథ్యంలో ఒరేయ్ ఆలు అంటూ స్పీకర్‌లో అరిచేశాడు. ఇంజమామ్ వుల్ హక్ ఫీల్డింగ్ చేస్తున్నంతసేపు బౌండర్ ఈ లైన్ దగ్గర నిలబడి… ఒరేయ్ ఆలు అంటూనే అరిచాడు శివ కుమార్ త్రిపాఠి అనే ఇండియన్ అభిమాని. అయితే ఇది గ్రహించిన ఇంజమామ్ వుల్ హక్… తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఓ బ్యాట్ తీసుకొని అతడిపై దాడికి పాల్పడ్డాడు.
దీంతో ఒక్కసారిగా స్టేడియంలో యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. అంతలోనే కెనడా పోలీసులు ( Canada Police) రంగంలోకి దిగారు. ఆ తర్వాత పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బెయిల్ పై అతడు విడుదలయ్యారు. ఇదే విషయాన్ని తాజాగా వసీమ్ అక్రమ్ గుర్తు చేశారు. ఒరేయ్ ఆలు అంటూ స్పీకర్‌లో అరిచిన తరుణంలోనే ఇంజమామ్ కు పీకల దాకా కోపం వచ్చిందని తెలిపారు. ఆ కోసం చూసి, తాను కూడా భయపడిపోయానన్నారు. ఆ తర్వాత బ్యాట్ తో ఇండియన్ ఫ్యాన్ ను దారుణంగా కొట్టాడని తెలిపారు.
ఇది ఇలా ఉండగా, ఇంజమామ్ ఉల్ హక్ పట్టుకున్న బ్యాట్ ను డ్రెస్సింగ్ రూమ్ లో నుంచి తీసుకువచ్చి ఇచ్చింది వసీం అక్రమే అని ఇప్పటికీ చెబుతూ ఉంటారు.