Jagan Strategy: స్థానిక సంస్థల ఎన్నికల వేళ జగన్ స్పీడ్ పెంచుతున్నారు. జిల్లాల పర్యటనలకు ప్రణాళికలు, క్యాడర్‌తో వరుస సమావేశాలు, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్న ఆదేశాలు.. ఇవన్నీ చూస్తే వైసీపీ ఈసారి లోకల్ వార్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నట్టే కనిపిస్తోంది. ప్రతి స్థానంలో అభ్యర్థిని నిలబెట్టాలని.. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దని జగన్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గ్రామస్థాయిలో ప్రజలతో నిరంతరం ఉండాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా సూచించారు. అంటే 2024లో వచ్చిన భారీ పరాజయం తర్వాత.. ముందుగా క్యాడర్‌ను నిలబెట్టుకోవడం, ఆ తర్వాత రాజకీయంగా పుంజుకోవడం జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే టైంలో కూటమిలో స్థానిక పదవుల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపకం, ఆధిపత్య పోరు కనిపిస్తోంది. మరి కూటమి లుకలుకలు, అసంతృప్తులను వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకోగలదా? లోకల్ వార్‌ను గెలుపుతో పాటే 2029కు గ్రౌండ్ ప్రిపరేషన్‌గా జగన్ చూస్తున్నారా?