Asia Cup 2025 : ఆసియా కప్ 2025 లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ మధ్య మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ పాకిస్తాన్ జట్టు మాత్రం ఇవాళ యూఏఈతో మ్యాచ్ ఆడబోమని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆసియా కప్ లో భారత్ తో హ్యాండ్ షేక్ వివాదం పాకిస్తాన్ హర్ట్ అయింది. మ్యాచ్ రిఫరీ ఆండీ ప్రై క్రాప్ట్ ని తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ తరుణంలో ఇవాళ రాత్రి 8 గంటలకు యూఏఈతో మ్యాచ్ జరగాల్సి ఉండగా.. పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం హోటల్ రూమ్ లోనే ఉండిపోయారు. అసలు మ్యాచ్ జరుగుతుందా..? లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇవాళ మార్నింగ్ పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రాక్టీస్ అయితే చేశారు. ఇంతలోనే ఈ షాక్ జరగడంతో అంతా ఆశ్చర్యపోవడం విశేషం.
Also Read : INDW Vs AUSW : రికార్డు సెంచరీ.. చరిత్ర సృష్టించిన టీమిండియా మహిళా క్రికెటర్..
ఒకవేళ ఇవాళ మ్యాచ్ జరగకపోతే… పాకిస్తాన్ ఆసియా కప్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే గ్రూప్ స్టేజిలో ఒకే ఒక మ్యాచ్ గెలిచింది పాక్.. కచ్చితంగా రెండు గెలిచిన జట్టు సూపర్ ఫోర్ కు వెళ్తాయి. దీంతో యూఏఈ జట్టు నేరుగా సూపర్ 4 కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ పొలిటికల్ గా చేసిన కామెంట్స్ కి క్షమాపణ చెప్పాలని.. మ్యాచ్ రిఫరీ ఆండ్రీ క్రాప్ట్ ను తొలగించాలని డిమాండ్లు పెట్టింది పీసీబీ. పాకిస్తాన్ జట్టు నో షేక్ హ్యాండ్ సాకుతో టోర్నీ నుంచి వైదొలిగే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ జట్టు. ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాళ్లు లగేజీ కూడా సర్దుకున్నట్టు సమాచారం. మరోవైపు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పొలిటికల్ గా కామెంట్స్ చేశాడని పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మ్యాచ్ కి రెండు గంటల ముందే పాకిస్తాన్ జట్టు అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురవుతున్నారు. ఆడలేక మద్దెల దరువు అన్న చందంగా పాకిస్తాన్ ఆసియా కప్ 2025 నుంచి వైదొలిగే ఆలోచనలో ఉన్నది. మరికొద్ది సేపట్లోనే పీసీబీ మిడియా కి వివరాలను వెల్లడించనున్నట్టు సమాచారం.
పాకిస్తాన్ వర్సెస్ యునైటేడ్ అరబ్ ఎమిరేట్స్ మ్యాచ్ లో ఇప్పుడు డ్రామా కొనసాగుతోంది. మ్యాచ్ కి కేవలం గంట సమయం మాత్రమే ఉండటం.. పాక్ క్రికెటర్లు స్టేడియం వద్దకు చేరుకోకపోవడంతో మ్యాచ్ జరుగుతుందా..? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా భారత్ తో హ్యాండ్ షేక్ వివాదం పై పాకిస్తాన్ జట్టు టోర్నమెంట్ నుంచి వైదొలగనున్నట్టు పీసీబీ వర్గాలు పాక్ మీడియా కి వెల్లడించాయి. సెప్టెంబర్ 14న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు.. పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో పరిస్థితులు అద్వాన్నంగా మారాయి. ఆ తరువాత ఐసీసీని ఆశ్రయించగా తిరస్కరించింది ఐసీసీ. దీంతో పాక్ అనూహ్య నిర్ణయం తీసుకొని ఇప్పుడు సంచలనంగా మారింది.