Vikarabad Robbery:వికారాబాద్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. దొంగలు రూ.40 లక్షల నగదు దొంగిలించి పారిపోతుండగా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సమాచారం తెలుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, దొంగలు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.