E-Paper
Advertisement

Vijayawada: అనుమానంతో నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి..

Vijayawada: అనుమానంతో నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి..
Advertisement

 Vijayawada:  విజయవాడ సూర్యారావు పేటలో ఓ కిరాతక భర్త బరితెగించాడు. నడిరోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. విజయవాడ విన్స్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న సరస్వతిని 2022 ఫిబ్రవరి 14వ తేదీన విజయ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బాబు. భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో విజయ్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే సరస్వతిపై అనుమానం పెంచుకున్న హంతకుడు విజయ్..తరచూ భార్యతో గొడవపడేవాడు. భర్త అనుమానంతో విసిగిపోయిన సరస్వతి కొన్నాళ్లుగా భర్తకు దూరంగా బాబుతో ఉంటోంది. ఈ క్రమంలో సరస్వతిపై కోపం పెంచుకున్న కిరాతకుడు విజయ్…ఇవాళ మధ్యాహ్నం సూర్యారావుపేటలో అందరూ చూస్తుండగా…కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. నిందుతుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

22A భూములపై పొలిటికల్‌ వార్‌..!

సెక్రటీరియట్‌లో లంచావతారాలు..!

తెగిపడిన పోతిరెడ్డిపాడు గేట్.. జలపోరు మళ్లీ షురూ!

బాబు మార్క్ పాలన.. ముందుగానే ప్రజలకు సంక్షేమ క్యాలెండర్!

సర్వే సమరం.. ప్రజలు ఎవరివైపు..?

జనసేనలోకి బడా నేతలకు దారేది?

Big Stories

Advertisement
×