BigTV English

Toilet Seat Explodes: బాంబులా పేలిన టాయిలెట్ సీట్.. యువకుడు స్పాట్ లోనే!

Toilet Seat Explodes: బాంబులా పేలిన టాయిలెట్ సీట్.. యువకుడు స్పాట్ లోనే!

Toilet Seat Blast: ప్రపంచంలో ప్రశాంతమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే.. అది బాత్ రూమ్ మాత్రమే. కాసేపు అక్కడ కూర్చొని ఎన్నో రకాల ఆలోచనలు చేస్తుంటారు. కొంత మంది ప్రముఖులు ముఖ్యమైన నిర్ణయాలు బాత్ రూమ్ లో నుంచే తీసుకుంటామని చెప్పిన సందర్భాలున్నాయి. అయితే, ఇకపై అక్కడ కూడా ప్రశాంతంగా కూర్చొనే పరిస్థితి కనిపించడం లేదు. యూపీలో వాష్ రూమ్ కు వెళ్లిన ఓ యువకుడికి షాకింగ్ ఇన్సిడెంట్ ఎదురయ్యింది. బాత్రూమ్ టాయిలెట్ సీట్ బాంబులా పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఇంతకీ టాయిలెట్ సీట్ ఎందుకు పేలింది? కారణాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


ఫ్లష్ కొట్టడంతో బ్లాస్ అయిన టాయిలెట్ సీట్

ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో అషు అనే 20 ఏళ్ల యువకుడు తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్నాడు. ఇంట్లో వెస్ట్రన్ టాయిలెట్ ఉంది. ఎప్పటి లాగే ఉదయం లేవగానే వాష్ రూమ్ కు వెళ్లాడు. పని పూర్తి అయిన తర్వాత టాయిలెట్ ఫ్లష్ ప్రెస్ చేశాడు. వెంటనే ఊహించని ఘటన ఎదురయ్యింది. ఒక్కసారిగా ట్రాయిలెట్ సీట్ బ్లాస్ట్ అయ్యింది. వాష్ రూమ్ అంతా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో అషు తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్లు, చేతుల, ముఖంతో పాటు ప్రైవేట్ పార్ట్స్ కు గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని హాస్పిటల్ కు తరలించారు. గ్రేటర్ నోయిడా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో అతడికి 35 శాతం గాయాలు అయినట్లు డాక్టర్లు తెలిపారు.


టాయిలెట్ సీట్ ఎందుకు పేలిందంటే?

టాయిలెట్ బ్లాక్ కు కారణం మీథేన్ వాయివు అయి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టాయిలెట్ బౌల్ లోపల మీథేన్ వాయువు అధికంగా పేరుకుపోయి పేలి ఉండవచ్చు అంటున్నారు. మురుగు నీరు సరిగ్గా వెళ్లకుండా పేరుకుపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయినట్లు అంచనా వేస్తున్నారు. వాష్ రూమ్ కు వెళ్లిన సమయంలో తమ కుమారుడు ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగించడం లేదని అషూ తండ్రి సునీల్ ప్రధాన్ వెల్లడించారు. ఏసీ సహా తన ఇంట్లోని అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు సరిగ్గానే పని చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో మీథేన్ మూలంగానే పేలుడు సంభవించి ఉంటుందని నిపుణులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

డ్రైనేజీ వ్యవస్థపై స్థానికులు ఆందోళన

అటు తమ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా పాతది అయ్యిందని స్థానికులు చెప్తున్నారు. “ఇక్కడ పైపులు చాలా పాతవి. వాటిని తరచుగా శుభ్రం చేయడం లేదు. మురుగునీరు సరిగా ప్రవహించకపోవడం వల్లే పైపులో మీథేన్ లాంటి   ప్రమాదకరమైన వాయువులు పేరుకుపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా బాత్రూమ్‌ లలో ఈ గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతుంది” అని స్థానిక నివాసి హరీందర్ భాటి తెలిపారు. బాత్రూమ్ లో పేలవంగా వెంటిలేషన్,  డ్రైనేజీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయకపోతే, మీథేన్ గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. వెంటనే ఆషూ వాళ్ల ఇంట్లో ప్లంబింగ్ వ్యవస్థను శుభ్రం చేయించుకోవాలని సూచిస్తున్నారు.

Read Also: బట్టతలపై  వెంట్రుకలు.. ఇద్దరి ప్రాణం తీసిన హెయిర్ ట్రాన్స్ ప్లాంట్!

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×