కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం కారణంగా చాలా జుట్టు రాలిపోతుంది. టెన్షన్ లైఫ్ కారణంగానూ జుట్టు పలుచబారిపోతోంది. బట్టతలపై జుట్టు మొలిపించుకునేందుకు చాలా మంది హెయిర్ ట్రాన్స్ ఫ్లాంటేషన్ చేయించుకుంటున్నారు. అయితే, కొన్నిసార్లు చికిత్స వికటించి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ ఇంజినీర్ కూడా హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవాలని భావించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది.
ప్రాణం తీసిన హెయిర్ ప్లాంటేషన్
ఫతేఘర్ కు చెందిన మయాంక్ కటియార్ అనే 32 ఏళ్ల ఇంజినీర్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజినీర్ గా పని చేస్తున్నారు. కాన్పపూర్ లో త్వరలో తన సొంత బిజినెస్ ను ప్రారంభించాలని భావిస్తున్నాడు. అయితే, ఆయనకు గత కొంత కాలంగా జుట్టు బాగా రాలిపోయి బట్టతల ఏర్పడింది. ఎలాగైనా తన బాల్డ్ హెడ్ మీద జుట్టు వచ్చేలా చికిత్స చేయించుకోవాలనుకున్నాడు. కేశవ్ పురం లోని ఎంపైర్ క్లినిక్ కు వెళ్లాడు. డాక్టర్ అనుష్కను కలిశాడు. గత ఏడాది నవంబర్ 18 నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తాజాగా మరోసారి క్లినిక్ కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. అర్థరాత్రి సమయంలో మయాంక్ తీవ్రమైన తల నొప్పి ఏర్పడింది. డాక్టర్ అనుష్క ఇంజెక్షన్ చేయించుకోవాలని సలహా ఇచ్చింది.
ఇంజెక్షన్ తీసుకున్నా మెరుగుపడని పరిస్థితి
డాక్టర్ సలహా ప్రకారం ఇంజెక్షన్ తీసుకున్నప్పటికీ మయాంక్ పరిస్థితి మెరుగు కాలేదు. ఆ తర్వాత జుట్టుకు కట్టిన కట్టును విప్పమని చెప్పింది. అయినా, రాత్రంతా నొప్పితో బాధపడ్డాడు. మరుసటి రోజు, అతడి ముఖం వాచింది. అదే సమయంలో తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. గుండె సంబంధ వైద్యుడు అతడికి ఎలాంటి గుండె సమస్య లేదని చెప్పి, డాక్టర్ అనుష్కను కలవాలని చెప్పాడు. అయితే, మయాంక్ పరిస్థితి మరింత దిగజారింది. చివరకు తన ప్రాణాలు కోల్పోయాడు. మయాంక్ పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కొడుకు చావుకు కారణమైన వారిని శిక్షించాని కోరారు.
कानपुर में हेयर ट्रांसप्लांट के वजह से पनकी पावर हाउस में इंजीनियर रहे विनीत दुबे की मौत हो गई थी। और अब डॉक्टर अनुष्का तिवारी के क्लिनिक में कराए गए एक और हेयर ट्रांसप्लांट से 24 घंटे के भीतर ही शख्स की जान चली गई। तब से डॉक्टर फरार है। pic.twitter.com/HxtJB0eFU4
— ब्रह्मऋषि (@TheSengarSahab) May 14, 2025
Read Also: అవిభక్త కవలల్లో ఒకరు చనిపోతే? మరొకరి పరిస్థితి ఏంటి?
గతంలోనూ ఈ క్లినిక్ లో చికిత్స తీసుకున్న వ్యక్తి మృతి
వాస్తవానికి ఈ క్లినిక్ లో హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుని గతంలోనూ ఓ వ్యక్తి చనిపోయాడు. వినీత్ దూబే అనే ఇంజినీర్ కూడా సేమ్ ఇలాగే ప్రాణాలు విడిచాడు. ఇప్పుడు మరో ఇంజినీర్ కన్నుమూశాడు. విషయం తెలిసిన వెంటనే డాక్టర్ అనుష్క క్లినిక్ ను క్లోజ్ చేసి పరారీ అయ్యింది. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసును రావత్‌పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుష్క భర్త కూడా డెంటల్ డాక్టర్ గా పని చేస్తున్నాడు. ఆయన కూడా అదే క్లినిక్ లో రోగులను చూసుకునే వాడట. ప్రస్తుతం ఈ క్లినిక్ ను క్లోజ్ చేసి ఇద్దరు ఎక్కడో పారిపోయారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Read Also: చికెన్ బిర్యానీలో బల్లి.. బాగానే ఫ్రై చేశాం తినేయండన్న ఓనర్.. సీన్ కట్ చేస్తే..!?