OTT Movie : సినిమాలు వెబ్ సిరీస్ లతో, ఓటిటి ప్లాట్ ఫామ్ నిండుకుండలా కళకళలాడిపోతోంది. ఎంటర్టైన్మెంట్ కోసం వీటి వైపే చూస్తున్నారు ప్రేక్షకులు. సినిమాలకు ధీటుగా, వెబ్ సిరీస్ లు పోటీ పడుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోపోయే సిరీస్ ఒక అడ్వెంచర్ లా సాగిపోతుంది. ఒక దీవిలో ఫ్లైట్ కూలిపోవడంతో స్టోరీ మొదలవుతుంది. ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠంగా సాగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
ఓషియానిక్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 815 అనే విమానం, ప్రయాణికులతో సిడ్నీ నుండి లాస్ ఏంజెల్స్‌కు వెళ్తూ ఉంటుంది. సాంకేతిక లోపం కారణంగా, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఒక ద్వీపంలో ఇది కూలిపోతుంది. విమానంలోని 324 మంది ప్రయాణికులలో 70 మంది మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడతారు. వీరిలో ఒక కుక్క కూడా ఉంటుంది. ఒక పక్క దట్టమైన అడవిప్రాంతం,మరో వైపు సముద్రం ఉండటంతో చాలా భయపడతారు. ఈ ద్వీపంలో బతకడానికి ఒకరితో ఒకరు సహకరించుకోవాల్సి వస్తుంది. అయినా ఈ ద్వీపంలో ఊహించని సంఘటనలు ఎదురౌతాయి. ప్రపంచానికి దూరంగా ఉండే ఈ ద్వీపంలో అతీంద్రియ శక్తులు, ఒక మాన్స్టర్, కొంతమంది అడవి తెగకు చెందిన వాళ్ళు ఉంటారు.
ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు జాక్ షెపర్డ్, కేట్ ఆస్టెన్, సాయర్, హర్లీ వాళ్ళ గత జీవితాన్ని ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా చెప్పుకుంటారు. వీళ్లమధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. మరోవైపు ఈ ద్వీపంలోని రహస్యాలు సిరీస్‌ను ఉత్కంఠభరితంగా మారుస్తాయి. ఆ దీవిలో ఉన్న మాన్స్టర్ వీళ్ళను భయబ్రాంతులకు గురిచేస్తుంది. కొంతమందిని క్రూరంగా చంపుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటారు. చివరికి వీళ్ళంతా వీళ్ళంతా ఆ దీవి నుంచి బయటపడతారా ? అడవిలో ఉన్న మాన్స్టర్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ? ఆ దీవిలో ఎటువంటి శక్తులు ఉన్నాయి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఒంటిపై నూలు పోగు లేకుండా కుప్పలుగా శవాలు… బ్లాక్ మ్యాజిక్ తో వణుకు పుట్టించే హర్రర్ థ్రిల్లర్
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ సిరీస్ పేరు ‘లాస్ట్’ (Lost). ఇది 2004 నుండి 2010 వరకు ABC ఛానల్‌లో ప్రసారమైంది. దీనిని జెఫ్రీ లీబర్, J.J. ఆబ్రమ్స్, డామన్ లిండెలాఫ్ సృష్టించారు. మొత్తం ఆరు సీజన్‌లు, 121 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందింది. ఊహించని సంఘటనలతో క్షణ క్షణం ఈ సిరీస్ ఉత్కంఠంగా సాగిపోతుంది. ఒక దీవి చుట్టూ ఈ స్టోరీ నడుస్తుంది. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.