BigTV English

Warangal Station New Look: వావ్.. వరంగల్ రైల్వే స్టేషన్.. ఎయిర్ పోర్టును మించిపోయిందిగా!

Warangal Station New Look: వావ్.. వరంగల్ రైల్వే స్టేషన్.. ఎయిర్ పోర్టును మించిపోయిందిగా!

Warangal Station New Look: ఇదొక రైల్వే స్టేషన్.. దీనిని రోజుకు ఒక్కసారైనా చూడనిదే ఆ నగరవాసులకు సమయం గడవదట. అలాంటి రైల్వే స్టేషన్ కు రోజూ ఫోటోలు దిగేందుకు కూడా ప్రయాణికులు వెళుతున్నారంటే, ఆ స్టేషన్ వైభవం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకు ఈ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? అసలు అక్కడి స్పెషాలిటీ ఏమిటో తెలుసుకుందాం.


ఒక్కసారి స్టేషన్‌లో అడుగుపెట్టగానే ఆహా అనిపిస్తుంది. బయట నుంచి చూసినా ఒక మోడరన్‌ కమర్షియల్ హబ్ లాగా.. లోపలకి వెళ్లగానే ఇంటీరియర్స్ చూస్తే ఏదైనా అంతర్జాతీయ విమానాశ్రయంలా! ఇదంతా ఎక్కడంటే.. మన వరంగల్ రైల్వే స్టేషన్లోనే!

తెలంగాణకు చారిత్రక గౌరవం తీసుకువచ్చిన వరంగల్, ఇప్పుడు తన రైల్వే స్టేషన్ ద్వారా ప్రయాణికుల మనసుల్ని కూడా గెలుచుకుంటోంది. రైల్వే శాఖ స్టేషన్ల అభివృద్ధి పేరుతో చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ప్రాజెక్టులో భాగంగా, రూ. 25.41 కోట్లతో వరంగల్ స్టేషన్ పూర్తిగా కొత్త అవతారం ఎత్తింది. ఎవరైనా వెళ్లి చూడగానే.. ఇది నిజంగా మన వరంగల్ దా? అని ఆశ్చర్యపోవాల్సిందే!


ఈ స్టేషన్.. పూర్తిగా హైటెక్ స్టైల్!
ఇప్పటివరకు స్టేషన్ అంటే ఓ రద్దీ, గందరగోళం, ఎక్కడికివెళ్లాలో అర్థం కాని పరిస్థితులు. కానీ ఇప్పుడు వరంగల్ స్టేషన్‌కు రాగానే.. అన్ని ఫ్లాట్‌ఫామ్స్ క్లీన్‌గా, క్లియర్‌గా కనిపిస్తాయి. ఎలివేటర్లు, ఎస్కలేటర్లు, విస్తారమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు.. ఇవన్నీ ప్రయాణికుల నడకను చాలా సులభతరం చేస్తున్నాయి. ఇటు నుంచి అటూ వెళ్లాలంటే ముందు లగేజ్ పట్టుకొని పడిపోయేవాళ్లకు ఇక అలాంటి కష్టాలేం ఉండవు. పెద్దవాళ్లు, చిన్న పిల్లలతో ఉన్నవాళ్లు కూడా బాగా సౌకర్యంగా ట్రైన్ ఎక్కి దిగొచ్చు.

లాబీ దాకా లగ్జరీ.. వెయిటింగ్ ఏరియాలో సిటీ ఫీల్!
ప్రయాణానికి ముందుగానే స్టేషన్‌లో కొంచెం సమయం గడిపేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి వెయిటింగ్ లౌంజ్‌లు అంత స్టైలిష్‌గా ఉన్నాయి. కుర్చీలు శుభ్రంగా ఉన్నాయి. టీవీలు ఉన్నాయి. టికెట్ కౌంటర్ల దగ్గర లాంగ్ క్యూలు లేవు. సెల్ఫ్ బుకింగ్ కియోస్క్‌లు కూడా అమర్చారు.

ముఖ్యంగా ప్రయాణికులకు డిజిటల్ డిస్ ప్లే బోర్డులు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఏ ప్లాట్‌ఫాం నుండి ఏ ట్రైన్ ఉందో స్పష్టంగా చూపించటం వల్ల గందరగోళం తగ్గింది. ఎలాంటి ప్రయాణికుడైనా.. ఆ స్టేషన్‌లో అడుగుపెడితే కనీసం 5 నిమిషాలు ఆగకుండా ఉండలేరు!

పచ్చదనం పక్కాగా.. ప్లాస్టిక్ లేని ప్రాంగణం!
ఒక్క అభివృద్ధి మాత్రమే కాదు.. పర్యావరణాన్ని కాపాడే కృతజ్ఞత కూడా కనిపిస్తుంది. స్టేషన్ చుట్టూ చిన్న చిన్న తోటలు, ఫ్లాంటేషన్, బాగా నిర్వహించిన చెట్లు ఉండటం వల్ల కూల్‌గా ఉంటుంది. సౌర విద్యుత్ వినియోగం వల్ల విద్యుత్ ఖర్చు తగ్గించడం కూడా గమనించదగ్గ విషయం.

Also Read: Vande Bharat Train: సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ వేళల మార్పు? కారణాలు ఇవేనా?

కారిడార్‌లు ప్లాస్టిక్ ఫ్రీగా ఉండటం, మురికిని తక్కువ చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా కన్పించేలా ఉన్నాయి. ఇది కేవలం ప్రయాణికులే కాదు, స్థానికుల మన్నన పొందింది.
ప్రయాణికుల మాటే బాస్.. వారికి ఏమైతే కావాలో అదే వస్తోంది!

మొన్నటి వరకు ఈ స్టేషన్‌కు రావాలంటేనే ప్రయాణీకులు జంకిన పరిస్థితి. ఇప్పుడు కుటుంబంతో వచ్చి కూర్చొని కాఫీ తాగేసి ట్రైన్ కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది.. అంటున్నారు ఒక మహిళా ప్రయాణికురాలు. ‘ఇది నిజంగా ఓ మార్పు. చిన్న పిల్లలతో, పెద్దవాళ్లతో ప్రయాణిస్తున్నాం అంటే ఇలాంటివే కావాలి అంటున్నారు ఇంకొకరు.

ఈ అభివృద్ధి వల్ల వరంగల్ స్టేషన్‌కు రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరిన్ని వాణిజ్య సదుపాయాలూ త్వరలో ఏర్పాటు చేస్తామని సమాచారం. అందరూ స్టేషన్ అంటే టికెట్ తీసుకునే చోటు మాత్రమే అనుకుంటారు. కానీ ఇప్పుడు ట్రావెల్ అనుభవాన్ని కూడా ఇచ్చేలా మారిపోయింది వరంగల్ రైల్వే స్టేషన్. ఇది కేవలం మార్పు కాదు ప్రజల అభిప్రాయాలకు ఇచ్చిన గౌరవం. అలాంటి అభివృద్ధి చూసి మన రాష్ట్రానికే గర్వపడకమానమంటారు ప్రయాణికులు!

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×