E-Paper
Advertisement

Social media fraud: రూ.26 వేలకే కారు.. ఇన్‌స్టాగ్రామ్ వీడియో పోస్ట్ చేసిన వ్యాపారి.. చివరకు ఏమైందంటే..?

Social media fraud: రూ.26 వేలకే కారు.. ఇన్‌స్టాగ్రామ్ వీడియో పోస్ట్ చేసిన వ్యాపారి.. చివరకు ఏమైందంటే..?
Advertisement

Social media fraud: రూ. 26 వేలకే కారు అంటూ సోషల్ మీడియాలో చేసిన ఒక తప్పుడు ప్రకటన చివరకు తీవ్ర ఉద్రిక్తతకు, పోలీసు కేసులకు దారితీసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్‌కు చెందిన రోషన్ అనే పాత కార్ల వ్యాపారి, రిపబ్లిక్ డే సందర్భంగా తన వద్ద ఉన్న 50 కార్లను కేవలం రూ. 26 వేలకే విక్రయిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ ఆఫర్ చూసి ఆకర్షితులైన వందలాది మంది ప్రజలు తెల్లవారుజామునే అతని దుకాణం వద్దకు భారీగా చేరుకున్నారు.

అయితే.. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు విషయం బయటపడింది. 50 కార్లు అమ్ముతానని చెప్పిన వ్యాపారి, తన వద్ద కేవలం 10 కార్లు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. తక్కువ ధర ఆశ చూపి తమను మోసం చేశాడని భావించిన జనం, రోషన్‌పై దాడికి దిగడమే కాకుండా అక్కడున్న వాహనాలపై రాళ్లతో దాడి చేశారు.

Advertisement

పరిస్థితి అదుపు తప్పడంతో రంగంలోకి దిగిన నాచారం పోలీసులు.. జనాన్ని చెదరగొట్టి రోషన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం చేసే ఇలాంటి జిమ్మిక్కులు చివరకు వ్యాపారిని కటకటాల పాలయ్యేలా చేశాయి.

ALSO READ:డ్రైవర్ హత్య కేసు ఉచ్చు.. ఎమ్మెల్యేపై విమర్శల అస్త్రం.. అనంతబాబు డైవర్షన్ పాలిటిక్స్?

Advertisement

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×