BigTV English

Most Expensive Lifestyle: ఈ ఒక్కడికే 1700 గదుల భవనం.. ఖరీదైన 600 రోల్స్ రాయిస్ కార్లు.. అంత సంపాదన ఎలా?

Most Expensive Lifestyle: ఈ ఒక్కడికే 1700 గదుల భవనం.. ఖరీదైన 600 రోల్స్ రాయిస్ కార్లు.. అంత సంపాదన ఎలా?

Sultan Hassanal Bolkiah Lifestyle: చాలా మంది ధనవంతులకు లగ్జరీ కార్లు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఏ కొత్త లగ్జరీ కారు మార్కెట్లోకి వచ్చినా వెంటనే తమ గ్యారేజీకి తెచ్చుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ లగ్జరీ కార్లు కలిగి ఉన్న వ్యక్తి బ్రూనే సుల్తాన్ హసనాల్‌ బోల్కియా. విలాసవంతమైన జీవితాన్ని గడపడంలో ఆయన తర్వాతే మరెవరైనా. తన దగ్గర ఉన్న లగ్జరీ కార్ల ఖరీదు ఏకంగా 5 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.


ప్రపంచంలోనే లగ్జరీయస్ లైఫ్ స్టైల్

ప్రపంచంలోనే ఎక్కువ కాలం రాజుగా పనిచేసిన రెండో చక్రవర్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు బోల్కియా. ఆయన లైఫ్‌ స్టైల్‌ లగ్జరీయస్‌ గా ఉంటుంది. బ్రూనేలోని ఇంధ‌న‌, గ్యాస్ వ్యాపారాల్లో ఆయనే టాప్. ఈ వ్యాపారాల ద్వారా ఆయన ఏకంగా 30 బిలియ‌న్ అమెరికన్ డాలర్లు సంపాదించారు.  సుల్తాన్ బ‌ల్కియా దగ్గర ఏకంగా 7 వేల ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి. వాటిలో 600 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక రోల్స్ రాయిస్ కార్లు ఉన్న వ్యక్తిగా ఆయనకు గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు ఉంది. బోల్కియా క‌లెక్ష‌న్‌ లో 450 ఫెరారీ కార్లు, 380 బెంట్లీ కార్లు ఉన్నాయి. పోర్షె, లాంబోర్గిని, మేబాచ్‌, జాగ్వార్‌, BMW, మెక్‌ లారెన్ కార్లు కూడా పదుల సంఖ్యలో ఉన్నాయి.


సుల్తాన్ దగ్గరున్న లగ్జరీ కార్లు

సుల్తాన్ బోల్కియా క‌లెక్ష‌న్‌ లో బెంట్లీ డామినేట‌ర్ ఎస్‌యూవీ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉంది. దాని విలువ సుమారు 80 మిలియన్ డాల‌ర్లుగా ఉంటుంది. పోర్షె 911 హారిజ‌న్ బ్లూతో పాటు 24 క్యారెట్ల గోల్డ్ తో తయారు చేయించిన రోల్స్ రాయిస్ సిల్వ‌ర్ స్ప‌ర్‌-2 కార్లు ఉన్నాయి. క‌స్ట‌మ్ డిజైన్డ్ రోల్స్ రాయిస్ విత్ ఓపెన్ రూఫ్ కారు కూడా ఉంది. ఆయన కూతురు, యువ‌రాణి మ‌జేదేదా పెళ్లి కోసం 2007లో గోల్డ్ కోటింగ్ రోల్స్ రాయిస్ కారును ఆయన కొనుగోలు చేశారు.

అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్ లో నివాసం

బోల్కియా ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్‌ లో నివాసం ఉంటున్నారు. ఈ భవంతి ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియ‌ల్ ప్యాలెస్‌ గుర్తింపు పొంది ఉంది. ఈ భవంతి ఏకంగా 20 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. 22 క్యారెట్ల బంగారంతో ఈ ప్యాలెస్ ను తీర్చిదిద్దారు. ఈ ప్యాలెస్‌ లో 5 స్విమ్మింగ్ పూల్స్, 1700 బెడ్ రూమ్స్‌, 257 బాత్ రూమ్‌లు, 110 గ్యారేజీలు ఉన్నాయి.  ఇక సుల్తాన్ ఓ జూను కూడా ఏర్పాటు చేయించాడు. అందులో 30 పులులు, పలు రకాల పక్షులు ఉన్నాయి.

ఎగిరే రాజభవనం బోయింగ్ 747 విమానం  

సుల్తాన్ బోల్కియా దగ్గర ఓ ప్రైవేట్ జెట్ తో పాటు ప్రైవేడ్ బెడ్ రూమ్ సూట్ ఉన్న కస్టమ్ బోయింగ్ 747 విమానం ఉంది.  బంగారం పట్ల అతడికి ఉన్న ఇష్టంతో విమానంలోని ఫర్నీచర్, వాష్‌ బేసిన్లకు బంగారం పూత పూయించారు. దీనిని ఎగిరే రాజభవనంగా పిలుస్తారు. ఇక ఆయన హెయిర్ కట్ కోసం వ్యక్తిగత బార్బర్ లండన్ నుంచి బ్రూనైకి తన ప్రైవేట్ జెట్ లో వస్తాడు. వాస్తవానికి 1980లలో సుల్తాన్ బోల్కియా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఆ తర్వాత అతడి స్థానంలోకి బిల్ గేట్స్ వచ్చాడు. ప్రస్తుతం సుల్తాన్ బోల్కియా నికర ఆస్తుల విలువ 30 బిలియన్ అమెరికన్ డాలర్లు.

Read Also: 20 ఏళ్లుగా నది దాటి వెళ్తూ, పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ.. ఈ రోజుల్లో ఇలాంటి టీచర్లు ఉన్నారా?

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×