Vaibhavam Movie: టాలీవుడ్ కొత్త దర్శకులకు ఎప్పుడు ఆహ్వానం పలుకుతుంది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం ) లో చదువుకున్న సాత్విక్ అనూహ్యంగా తెలుగు సినిమా దర్శికుడిగా ఏంటి ఇచ్చారు. మంచి చదువు చదువుకున్న సాత్విక్ కార్పొరేట్ దిశగా వెళ్లకుండా మెగా ఫోన్ పట్టాడు. నూతన దర్శకుడిగా తెలుగు తెరపై పరిచయం కానున్నాడు. ఇటీవల ఆయన సినిమా ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకుల అంచనాలను పెంచింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆ దర్శకుడు గురించి చూద్దాం..
తెలంగాణ కుర్రాడు ..టాలివుడ్ లోకి ఎంట్రీ
తెలంగాణలో సూర్యాపేటకు చెందిన సాత్విక్ విశాఖపట్నం లో తన విద్యను పూర్తి చేసుకొని పట్టభద్రుడు అయ్యాడు. తనకి చిన్నతనం నుండి సినిమాలు మీద ఉన్న ఇంట్రెస్ట్ తో, మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలన్న తపనతో కలలుకన్నాడు. తను చదువుకున్న చదువుని, నైపుణ్యాన్ని సినిమాల్లో ఉపయోగిస్తే మంచి ఫలితాలను అందుకోవచ్చు అని సాత్విక్ అభిప్రాయపడ్డాడు. అందులో భాగంగా దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నాడు. సాత్విక్ తొలి చిత్రం ‘వైభవం’ ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రిత్విక్,ఇక్రా ఇద్రిసి తోపాటు కొత్త నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. తెలుగు సినిమాల లో సాత్విక్ తనదైన ముద్రణ వేస్తాడా లేదా అన్నది ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు వేసి చూడాలి.
అందరూ కొత్త వారే ..
వైభవం ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రమాదేవి ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం, సెన్సార్ ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పాటలకు ట్రైలర్ కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. నూతన దర్శకుడు నూతన నిర్మాణ సంస్థ, నూతన నటీనటులతో, కొత్త సినిమా వైభవం మే 23న థియేటర్లలోకి రానుంది.