BigTV English

UK Woman Job Offer: జాబ్ కోసం అప్లై చేసిన 48 ఏళ్లకు ఆఫర్ లెటర్, దురదృష్టం లాంటి అదృష్టం అంటే ఇదేనేమో?

UK Woman Job Offer: జాబ్ కోసం అప్లై చేసిన 48 ఏళ్లకు ఆఫర్ లెటర్, దురదృష్టం లాంటి అదృష్టం అంటే ఇదేనేమో?

యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు జీవితంలో ఉన్నత స్థానాలకు రావాలని కోరుకుంటాం. చదివిన చదువుకు ఉన్న టాలెంట్ కు తగినట్లుగా ఉద్యోగాల కోసం వెతుకులాట మొదలుపెడతాం. నచ్చిన ఉద్యోగం దక్కించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. మనిషి బతుకు బండి లాగించేందుకు ఎన్ని ఉద్యోగాలు చేసినా, ప్రతి వ్యక్తి జీవితంలో మనసుకు నచ్చిన ఉద్యోగం ఒక్కటే ఉంటుంది. అలాంటి ఉద్యోగం జీవితం అంతా అయిపోయాక వస్తే? ఇదేం అదృష్టం రా నాయనా? అని నిట్టూర్చాల్సి ఉంటుంది. అచ్చంగా ఓ లండన్ మహిళ విషయంలో ఇలాగే జరిగింది. తనకు ఇష్టమైన ఉద్యోగం కోసం అప్లై చేస్తే ఏకంగా 48 ఏండ్లకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఆ లెటర్ చూసి తన దురదృష్టానికి తానే తిట్టుకుంటూ నిట్టూర్చింది.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

లండన్ కు చెందిన ఆ మహిళ పేరు టీజీ హాడ్సన్. ప్రస్తుతం ఆమె వయసు 70 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి ఆమెకు స్టంట్ మాస్టర్ కావాలనే కోరిక ఉండేది. 1796లో జనవరిలో యంగ్ ఏజ్ లో ఉన్న ఆమె మోటార్ సైకిల్ స్టంట్ రైడర్ ఉద్యోగానికి అప్లై చేసింది. ఎంత కష్టం అయినా ఆమె ఈ ఉద్యోగం చేయాలి అనుకుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కంపెనీకి ఓ లెటర్ పంపించింది. కారణాలు ఏవో తెలియదు.


ఆమె లెటర్ కు సదరు కంపెనీ నుంచి స్పందన రాలేదు. రోజుల తరబడి ఇంటి ముందు ఉన్న పోస్ట్ బాక్స్ వైపు ఆశగా చూసింది. నెలలు గడిచినా రిప్లై లేదు. ఇక తనకు ఆ ఉద్యోగం చేసే అదృష్టం లేదు అనుకుంది. మనసుకు నచ్చిన ఉద్యోగం గురించి ఆలోచించడం మానేసి బతికేందుకు చేయాల్సిన ఉద్యోగాల గురించి ప్రయత్నాలు మొదలు పెట్టింది. లండన్ నుంచి ఆఫ్రికాకు వెళ్లింది. అక్కడ స్నేక్ హ్యాండ్లర్‌, గుర్రాల కేర్ టేకర్ గా పని చేసింది. కొద్ది కాలం పాటు విమానాలు నడపడం నేర్చుకుంది. తను నేర్చుకోవడంతో పాటు మరికొంత మంది నేర్పించింది. ప్రస్తుతం హాయిగా ఇంటి దగ్గరే ఉంటుంది.

48 ఏండ్లకు హాడ్సన్ చేతికి ఆఫర్ లెటర్

అన్ని ఉద్యోగాలు చేసి జీవిత చరమాంకంలో జీవితాన్ని గడుపుతున్న హాడ్సన్ కు ఓ లెటర్ వచ్చింది. దాన్ని విప్పి చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. 22 ఏండ్ల వయసులో ఇష్టమైన ఉద్యోగానికి అప్లై చేస్తే ఏకంగా 48 ఏండ్ల తర్వాత ఆమెకు ఆఫర్ లెటర్ వచ్చింది. తనకు ఇష్టమైన ఉద్యోగానికి సంబంధించి ఇన్నాళ్లకు లెటర్ వచ్చినా, ఆమె పెద్దగా నిట్టూర్చింది. వయసులో ఉన్నప్పుడు చేయాల్సి ఉద్యోగం మసలి తనంలో చేస్తారా? అంటూ తీసి పక్కకు పెట్టింది.

కానీ, ఆమె కోరుకున్న ఉద్యోగం కోసం ఇన్ని ఏండ్ల తర్వాత పిలుపు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాదు, సుమారు నాలుగు దశాబ్దాల కాలంలో తాను ఎన్నో దేశాలు తిరిగానని, ఎన్నో ఇండ్లు మారానని, అయినా తన అడ్రెస్ పట్టుకుని ఈ లెటర్ రావడం షాకింగ్ గా ఉందని హాడ్సన్ వెల్లడించింది. ఇదే ఉద్యోగం ఆ రోజుల్లో వచ్చి ఉంటే ఎంతో సంతోషించే దాన్నని చెప్పుకొచ్చింది.

Read Also: ‘బతుకు బండి‘ మీదే ప్రాణాలు విడిచి.. కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో!

Related News

Viral Video: బ్యాట్ తో కుర్రాళ్లు, లోకల్ ట్రైన్ లో ఆడాళ్లు.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టారంతే!

Viral Video: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Big Stories

×