BigTV English

Viral Video: ‘బతుకు బండి‘ మీదే ప్రాణాలు విడిచి.. కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో!

Viral Video: ‘బతుకు బండి‘ మీదే ప్రాణాలు విడిచి.. కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో!

Odisha Street Vendor Death: మనిషి జీవితంలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు ఉన్న మనిషి, కాసేపటికి బతికి ఉంటాడో? లేదో తెలియదు. అందుకే, పెద్దలు  మనిషి జీవితం గురించి సింపుల్ గా ‘బుద్బుద ప్రాయం’ అని చెప్పారు. అంటే, నీటి బుడగ లాంటింది. వర్ష  ప్రవాహంలో ఎన్నో బుడగలు ఏర్పడుతాయి. ముందుకు సాగిపోతుంటాయి. వాటిలో ఏది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. అలాగే, ఈ క్షణం ఉన్న ప్రాణం, మరుక్షణం ఉంటుందో లేదో ఎవరూ చెప్పలేరు. ఏ పురుగో పుట్రో కరిచి పోవచ్చు. స్నానం చేస్తున్నప్పుడు ఊపిరాడక పోవచ్చు. నిద్రలోనే గుండెపోటుతో చనిపోవచ్చు. ప్రయాణంలో మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడువచ్చు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే.. ఇప్పుడు మనం తెలుసుకోబోయే స్టోరీ మనిషి జీవితం ఎలా ఉంటుందో చెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహరణ..


‘బతుకు బండి’ మీదే ప్రాణాలు విడిడిచిన వీధి వ్యాపారి

ఒడిషాలో సుమారు 40 ఏండ్ల వ్యక్తి వీధి వ్యాపారం చేస్తుంటాడు. పొద్దున్నే లేచి తన టీవీఎస్ బండికి  తినుబండారాలు కట్టుకుంటాడు. వాటిని వీధుల్లో తిరుగుతూ అమ్ముతాడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు పట్టణాలతో పాటు సరిసర గ్రామాల్లోకి వెళ్లి వాటిని విక్రయిస్తాడు. సాయంత్రానికి సంపాదించిన డబ్బుతో ఇంటికి చేరుకుంటాడు. పిల్లలా పాపలతో హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ, ఎప్పటి లాగే తినుబండారాలను అమ్మేందుకు బయటకు వెళ్లిన వ్యక్తి మళ్లీ తిరిగి రాడని ఆ కుటుంబ సభ్యులు ఊహించి ఉండరు. బండి మీద వెళ్లే తనకు కూడా ఇదే తన జీవితంలో చివరి రోజు అవుతుందని తెలియకపోవచ్చు.


గుండె పోటుతో స్పాట్ డెత్

ప్రతి రోజు మాదిరిగానే తినుబండారాను తన బండికి తగిలించుకుని బయల్దేరాడు. వాటిని అమ్ముకుంటూ సమీపంలోని పట్టణానికి వెళ్లాడు. నెమ్మదిగా వర్షం మొదలయ్యింది. కొద్దిసేపు అలాగే అమ్మాడు. వర్షం కాస్త పెరగడంతో.. ఓ చోట మూసి ఉన్న షాప్ ముందు బండి ఆపాడు. వర్షం తగ్గాక అక్కడి నుంచి వెళ్లాలి అనుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత గుండెల్లో ఏదో నొప్పిగా అనిపించింది. తన వెంట తెచ్చుకున్న మంచి నీళ్లు తాగాడు. ఇంకాస్త నొప్పి పెరిగింది. వర్షం బాగా పడుతుంది. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఛాతిలో నొప్పితో తట్టుకోలేకపోయాడు. పరిస్థితి మరింత విషమించింది. గుండె ఆగిపోయింది. తన జీవితం ముగిసిపోయింది. ఇంత కాలం తన బతుకుబండిని లాగించిన బండి మీదే ప్రాణాలు కోల్పోయాడు.

కంటతడి పెట్టిస్తున్న వీడియో

వర్షం తగ్గాక అటుగా వచ్చిన స్థానికులు అతడిని చూశారు. మొదట్లో బండి మీద పడుకున్నాడేమో అనుకున్నారు. అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూస్తే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే విషయాన్ని పోలీసులకు చేరవేశారు. అంబులెన్స్ తో పాటు అక్కడికి వచ్చారు పోలీసులు. డాక్టర్లు అతడిని పరీక్షించి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్దారించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ దృశ్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అన్నట్టు ఉంది ఈ వీడియో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Read Also: ఉద్యోగం పోయిందని.. డ్రైవర్ ను పొడిచిన యువకుడు.. అలా చెప్పడమే తప్పైంది!

Related News

Viral Video: బ్యాట్ తో కుర్రాళ్లు, లోకల్ ట్రైన్ లో ఆడాళ్లు.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టారంతే!

Viral Video: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Big Stories

×