BigTV English

Kavya Thapar : సినిమా కోసం తొమ్మిది రోజులు ఉపవాసాలు

Kavya Thapar : సినిమా కోసం తొమ్మిది రోజులు ఉపవాసాలు

Kavya Thappar : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ తమకంటూ ఒక సొంత గుర్తింపును సాధించుకొని నిలబడ్డారు. అసలు ఇండస్ట్రీలో హీరోహిన్ గా నిలబెట్టుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎన్నో అవరోధాలను దాటి ఒక స్థాయికి రావడం అనేది మామూలు విషయం కాదు. కొన్నిసార్లు హీరోయిన్ చేసిన మొదటి సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినా కూడా వరుసగా అవకాశాలు వస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో శ్రీ లీల పేరు చెప్పొచ్చు. శ్రీ లీల చేసిన పెళ్లి సందడి సినిమా ఊహించిన స్థాయిలో ఆడకపోయినా కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి హీరోల సినిమాల్లో కూడా చేసే అవకాశం దక్కించుకుంది.


కొన్నిసార్లు మొదటి సినిమా సూపర్ హిట్ అయినా కూడా హీరోయిన్గా కొంతమంది నిలబడలేరు. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు కృతి శెట్టి కెరియర్లు సరైన హిట్ సినిమా పడలేదు అని చెప్పాలి. అలానే చిరుత సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి. రామ్ చరణ్ సరసన నటించిన కూడా ఆ తర్వాత సరైన హిట్ సినిమా నేహా కి పడలేదు. ఇలా చాలామంది హీరోయిన్స్ హిట్స్ పడినా కూడా కనుమరుగైపోయారు. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కావ్య తప్పర్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ సరసన ఈ అమ్మాయి కనిపించింది. ఈ సినిమా ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియనంతగా జరిగిపోయింది.

ఇప్పటివరకు పూరి జగన్నాథ్ చాలా మంది హీరోయిన్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వారిలో రక్షిత, నేహ శెట్టి, రీసెంట్ టెన్స్ లో కావ్య తప్పర్ వంటి హీరోయిన్స్ సరైన కెరియర్ లేకుండా పోయింది. అలానే పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్స్ లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అనుష్క, హన్సిక వంటి హీరోయిన్స్ అద్భుతమైన సినిమాలు చేసి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం కావ్య శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ సరసన విశ్వం సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ సినిమా ప్రమోషన్స్ చాలా జోరుగా జరుగుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా కోసం దాదాపు తొమ్మిది రోజులు పాటు ఉపవాసం ఉన్నట్లు రివిల్ చేసింది కావ్య.


అయితే కావ్య ఈ విషయం చెప్పగానే దర్శకుడు శ్రీనువైట్ల హీరో గోపీచంద్ ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఆహారం తీసుకోవట్లేదా అని అదే ఇంటర్వ్యూలో గోపీచంద్ కూడా అడిగారు. దానికి సమానంగా కొన్ని కొన్ని పదార్థాలను లిమిటెడ్ గా తీసుకుంటున్నట్లు తెలుపుతూ, ఆనియన్స్, జింజర్ లేకుండా అనేక పదార్థాలను లిమిటెడ్ గా తింటున్నట్లు కావ్య చెబుతూ వచ్చింది. సినిమా హిట్ అవడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా చెప్పింది కావ్య. ఇదేమైనా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడం అనేది పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, గోపీచంద్ కి, శ్రీను వైట్లకి, అలానే కావ్య తప్పర్ కు కూడా చాలా అవసరం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×