8 Vasantalu Trailer: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘8 వసంతాలు’ (8 Vasantalu) సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా జూన్ 20వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీలో అనంతిక సనీల్‌కుమార్(Ananthika Sunil Kumar) లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.
సమాధి చేసుకున్న జ్ఞాపకాలు..
ఈ ట్రైలర్ లో భాగంగా కన్న తల్లిదండ్రులు చనిపోతే చితి పెట్టడానికి అమ్మాయిలు అనర్హులు కాదని చెప్పడంతో “పేగు పంచుకొని ప్రాణం పోసే మాకు .. చితికి మంట పెట్టి మోక్షం కల్పించే హక్కు లేదా” అంటూ చెప్పే డైలాగులు అందరిని ఆకట్టుకున్నాయి. ఇలా ఒంటరిగా ఒక అమ్మాయి తన జీవితంలో ఎలా ముందుకు సాగింది? ఒంటరి జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనే విషయాలను స్పష్టంగా చూపించారు? ఇక ప్రేమ గురించి కూడా ఈ ట్రైలర్ లో ఎంతో అద్భుతంగా చూపించారని తెలుస్తుంది. “ప్రేమ అనేది జీవితంలో ఒక దశ మాత్రమేనని.. అదే దిశ కాదంటూ ,మగాడి ప్రేమకు సాక్షాలుగా పాలరాతి సౌదాలు, భాగ్యనగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకు ఏముంది మనసులో సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప అంటూ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇలా ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం సినిమా పై మంచి అంచనాలని పెంచేస్తోంది.
మ్యాడ్ సినిమాతో…
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనంతిక కేరళ అమ్మాయి అయినప్పటికీ మ్యాడ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగులో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న అనంతిక త్వరలోనే 8 వసంతాలు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జూన్ 20వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తోంది.
సినిమాలలోకి రావాలని అనుకోలేదు…
ఇక ఈ సినిమాలో ఈమె పెద్ద ఎత్తున కరాటే చేసినట్లు ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో చూపించారు కానీ చిన్నప్పటి నుంచే ఈమె డాన్స్ కరాటే అంటే ఇష్టం కావడంతో నేర్చుకున్నానని తెలిపారు. ఇక మొదటి నుంచి కూడా తనకు సినిమాలలోకి రావాలని ఆసక్తి ఏమాత్రం లేదని, కరోనా సమయంలో అనుకోకుండా తాను ఓ మలయాళీ సినిమాలోకి డ్యాన్సర్ గా వెళ్లడంతో అక్కడ డీఓపీ తనను చూసి హీరోయిన్ గా ట్రై చేయాలని తనకు సలహా ఇచ్చినట్టు తెలిపారు. ఇలా అతని సలహా మేరకు తాను సినిమా ప్రయత్నాలు చేస్తూ ఆడిషన్స్ కి వెళ్ళానని అనంతిక వెల్లడించారు. ఇలా అనుకోకుండా సినిమాలలో అవకాశం రావడం, మొదటి సినిమాలతోనే మంచి సక్సెస్ అందుకోవడం జరిగింది. ఇక త్వరలో రాబోయే 8 వసంతాలు సినిమా కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ కావటం ఇందులో ఈమె ప్రధాన పాత్రలో నటించడంతో కచ్చితంగా ఈ సినిమాతో తనకు మరింత మంచి ఆదరణ లభిస్తుందని స్పష్టమవుతుంది.