BigTV English

Viral Video: క్యాబ్ డ్రైవర్‌పై మహిళ తిట్ల దండకం.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..

Viral Video: క్యాబ్ డ్రైవర్‌పై మహిళ తిట్ల దండకం.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..

Viral Video: ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో వందల కొద్దీ వీడియోలను చూస్తుంటాం. కొంతమంది తమ ప్రత్యేకమైన ఆలోచనలు ప్రజలకు తెలిపేందుకు సోషల్ మీడియాలను తరచూ వేదికగా వాడుతుంటారు. మరికొందరు వారు స్వీకరించే ప్రతికూల అభిప్రాయాల కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటారు. ఇటీవల, ఒక మహిళ, క్యాబ్ డ్రైవర్‌తో మాటల వాగ్వివాదానికి పాల్పడిన వీడియో ట్విట్టర్ లో చర్చనీయాంశంగా మారింది. వీడియోలో మహిళ దూషిస్తున్న తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగింది. ఆ వీడియోలో ఏం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.


ఒక మహిళ ప్రయాణిస్తున్న వాహనం(కారు) మధ్యలో చెడిపోయింది. దీంతో ఆ మహిళ క్యాబ్ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగింది. మహిళా, డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ, ఎగతాళి చేసింది. 2 నిమిషాల 30 సెకన్ల విడివి గల ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఉబెర్ డ్రైవర్ విజ్ఞప్తి చేసినప్పటికీ, మహిళా ప్రయాణికురాలు అతని స్థితిని ఎగతాళి చేస్తూ, జీవనోపాధిని కించపరిచింది. ఈ విషయం ఇంతటితో ఆగకపోవడంతో డ్రైవర్ ఉబర్ కు కంప్లైంట్ చేయమని తనతో గొడవకు దిగవద్దని తెలిపాడు. దీంతో మహిళ తనపై భౌతిక హింస, పబ్లిక్ లో అవమానం, చట్టపరమైన చర్యలు వంటివి తీసుకుంటానంటూ బెదరింపులకు పాల్పడింది.

క్యాబ్ డ్రైవర్‌తో మహిళ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ..‘ఇటువంటి సందర్భాలను అధికారులు గుర్తించాలి. జీవనోపాధి కోసం కష్టపడుతున్న డ్యూటీ డ్రైవర్‌తో అనుచితంగా ప్రవర్తించినందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలి. కానీ కొంతమంది మహిళా సాధికారత చట్టాలను దుర్వినియోగం చేసి, మన సమాజంలోని నైతికతలను తగ్గిస్తున్నారు’ అని పేర్కొన్నాడు.


Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×