E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఇంట్లో వందలాది పాములు.. కరెంట్ బిల్లుకు బయట పడ్డా షాకింగ్ ఘటన

ఇంట్లో వందలాది పాములు.. కరెంట్ బిల్లుకు బయట పడ్డా షాకింగ్ ఘటన
Advertisement

Illegal Python: నార్మల్‌గా కొండ చిలువను చూస్తే పరుగో పరుగు. మనల్ని చుట్టుకుంటాయోనన్న భయం అనుక్షణం వెంటాడుతోంది. అలాంటి ఓ ఇంట్లో వందల కొద్దీ కొండచిలువలు బయటపడ్డాయి. వాటిని ఎవరైనా పెంచుతున్నారా? అన్ని కొండచిలువలు ఇంట్లో ఎలా ఉన్నాయి? చుట్టుపక్కల వాళ్ల పరిస్థితి ఏంటి? కొండ చిలువల వ్యవహారం పోలీసులకు పెద్ద టాస్క్‌గా మారిందా? మరి పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేద్దాం.

చైనాలోని ఓ హిల్ ప్రాంతంలో పోలీసులు భారీ ఆపరేషన్

Advertisement

రెండేళ్ల కిందట అంటే 2024 మార్చిలో తాయిఝౌ-ఝేజియాంగ్ ప్రావిన్స్‌లోని హిల్స్ ప్రాంతంలో ఓ పెద్ద కొండ చిలువను చూశాడు ఓ వృద్ధుడు. వాటిని చూడగానే అది ఏ రకానికి చెందినదో కొందరు వ్యక్తులు ఠక్కున చెబుతారు. పెద్దాయనకు అదే అనుమానం వచ్చింది. ఈ తరహా కొండచిలువలు ఇక్కడ ఉండవని, ఎలా వచ్చిందనే ఆలోచన మనసులో మొదిలింది.

చివరకు అనుమానం వచ్చి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు రంగంలోకి దిగారు. కొండచిలువను చూడగానే అక్రమ బ్రీడింగ్ సెంటర్‌ నుంచి తప్పించుకుని వచ్చి ఉంటుందని అనుమానం ఏర్పడింది. అందులోనూ మార్చిలో ఆ ప్రాంతంలో పాములు యాక్టీవ్‌గా ఉండవు. పోలీసులకు అనుమానాలు వస్తున్నాయిగానీ, ఆధారాలు లేవు. చివరకు పాములను పెంచేవారిని సంప్రదించారు.

Advertisement

ఓ ఇంట్లో 309 కొండ చిలువలు, షాకైన పోలీసులు, దర్యాప్తులో షాకింగ్ నిజాలు

పాము గురించి కొన్ని విషయాలు బయటపెట్టారు. పాములు పిల్లల్ని కనాలంటే వెచ్చటి వాతావరణం ఉండాలన్నారు. అక్రమంగా బ్రీడింగ్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి.. పాముల బ్రీడింగ్ కోసం ఎలక్ట్రిసిటీని ఉపయోగించే అవకాశముందంటూ క్లూ ఇచ్చారు. దీంతో పోలీసులు దర్యాప్తు ఇంకాస్త లోతుల్లోకి వెళ్లింది. హిల్స్ ప్రాంతాల్లో ఇళ్లువారు ఉపయోగించే ఎలక్ట్రిసిటీపై దృష్టి పెట్టారు.

ఈ నేపథ్యంలో ఓ వ్యక్తిపై పోలీసులకు అనుమానం వచ్చింది. అతడి ఇంటికి వాళ్లకంటే ఎక్కువగా కరెంట్ బిల్లు రావడం గమనించారు. అతడి గురించి ఎంక్వైరీ చేస్తే పెళ్లి కాలేదని తేలింది. ఆ అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడని తెలుసుకున్నారు. సీన్ కట్ చేస్తే.. పాములు పెంచే గువో ఇంటికి ఓ వ్యక్తి తరచుగా వెళ్లి వస్తుండేవాడు. తెల్ల ఎలుకల ఉండే పార్సిల్స్‌ను పెంపుడు పాములకు ఆహారంగా వేయడాన్ని తెలుసుకున్నారు.

కొండచిలువల గురించి అన్ని కోణాల్లో సమాచారం సేకరించి చివరకు గువో ఇంటికి వెళ్లారు. తలుపులు ఓపెన్ చేసి చూడగానే అక్కడి దృశ్యాలు చూసి ఒక్కసారిగా షాకయ్యారు. లోపల వందల కొద్దీ కొండచిలువలు కనిపించాయి. ఒకటి రెండూ కాదు ఏకంగా 309 పాములను సీజ్ చేసి స్థానిక జూకు తరలించారు. అక్రమంగా పాములను పెంచి అమ్ముతున్న గువోను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ALSO READ: రీల్స్ చూసి విసుగొచ్చిందా? నెటిజన్లను పిచ్చెక్కిస్తున్న సరికొత్త ట్రెండ్!

ఫ్లాట్‌లోని ఖాళీ స్థలాన్ని కొండచిలువలను పెంపక కేంద్రంగా మార్చేశారు. గదులలో ప్లాస్టిక్ కంటైనర్లను పేర్చి ఒక్కో కంటైనర్‌లో ఒక్కో కొండ చిలువను ఉంచాడు. ఆ ప్రాంతంలో పోలీసులు చేసిన అతి పెద్ద ఆపరేషన్ ఇది. విచారణ సమయంలో కొన్ని విషయాలు బయటపెట్టాడు. చాలా ఏళ్లుగా పాముల పట్ల ఆకర్షితుడయ్యానని అంగీకరించాడు.

2014 లో నాలుగు కొండచిలువలను కొనుగోలు చేసినట్టు తెలిపాడు. అక్కడి నుంచి తన ప్రయాణం మొదలైందని, వాటి పెంపక మెళకువలను నేర్చుకున్నానని చెప్పాడు. పుష్కరకాలంలో వివిధ రంగుల నమూనాలతో పాములను ఉత్పత్తి చేయడంలో నైపుణ్యం సాధించాడు. అంతేకాదు వివిధ రకాల కొండచిలువలను పెంచగల సృష్టికర్త‌గా అభివర్ణించుకున్నాడు. సుమారు 80 కొండచిలువలను అమ్మినట్టు దర్యాప్తులో తేలింది.

Related News

రీల్స్ చూసి విసుగొచ్చిందా? నెటిజన్లను పిచ్చెక్కిస్తున్న సరికొత్త ట్రెండ్!

వైరల్ వీడియో .. ప్రతిరోజూ మూత్రం తాగితే అంత గ్లో వస్తుందా? నిజమెంత?

అతి అందం శాపమైంది: మరీ హ్యాండ్‌సమ్‌గా ఉన్నానని సర్జరీ చేయించుకుంటున్న యువకుడు!

డోర్ దగ్గర గొడవ.. లోకల్ ట్రైన్‌లో యువకుడి దారుణ హత్య.. అసలేం జరిగిందంటే?

ఫ్లైఓవర్‌పై భార్యకు బర్త్‌డే పార్టీ.. అడ్డంగా బుక్కైన బిజినెస్‌మేన్, వీడియో వైరల్

యూకేలో విచిత్రం.. మగాళ్ళ నుంచి పాలు.. నెట్టింట వైరల్ అవుతున్నస్టోరీ

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ‘ఫుట్ బేకింగ్’ వీడియో.. ఇది టేస్ట్ కోసమా? లేక వ్యూస్ కోసమా?

Big Stories

×