BigTV English

Kim Jong – Trump: ట్రంప్ కు కిమ్ మామ హెయిర్ కట్.. తన లుక్ చూసుకుని ఒకటే ఏడుపు!

Kim Jong – Trump: ట్రంప్ కు కిమ్ మామ హెయిర్ కట్.. తన లుక్ చూసుకుని ఒకటే ఏడుపు!

Kim Jong Un- Donald Trump Viral Video: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జంగ్ ఉన్(Kim Jong Un) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వీళ్లిద్దరు మాట్లాడే మాటలు, చేసే చేష్టలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. వీళ్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. బోలెడు ఎడిటెడ్ వీడియోలు ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తుంటాయి. కిమ్ ఎప్పుడూ సీరియస్ గా కనిపిస్తే, ట్రంప్ మాత్రం కాస్త కామెడీగా అలరిస్తాడు. తాజాగా వీరికి సంబంధించి మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫుల్ ఫన్నీగా అలరిస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందంటే..


ట్రంప్ కు హెయిర్ కట్ చేసిన కిమ్

లేటెస్ట్ వీడియోలో ట్రంప్ కు కిమ్ హెయిర్ కట్ చేస్తూ కనిపించాడు. ట్రంప్ ను కిమ్ కటింగ్ సీట్లో కూర్చోబెట్టి. జుట్టు మీద పడకుండా చక్కగా క్లాత్ కట్టి, ఒక చేతిలోకి కత్తెర, మరొక చేతిలోకి దువ్వెన పట్టుకుని నెమ్మదిగా కట్ చేయడం మొదలు పెట్టాడు పది నిమిషాల తర్వాత చూస్తే, అచ్చం తన హెయిర్ స్టైల్ మారిగానే ట్రంప్ జుట్టు మార్చేశాడు. కిమ్ మామ చేసిన పని చూసి, ట్రంప్ తాత చిన్న పిల్లాడిలా ఏడ్వడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఈ వీడియోను ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించారు.


Read Also: వామ్మో పాము.. ఏకంగా బుల్లెట్ ట్రైన్నే ఆపేసింది కదయ్యా!

ఫుల్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు

ఇక ఈ కామెడీ వీడియోను చూసి నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు. “ట్రంప్ కు ఈ హెయిర్ స్టైల్ అద్భుతంగా సూటయ్యింది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఏఐకి నిజంగా థ్యాంక్స్, అద్భుతమైన కామెడీ అందిస్తోంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఈ హెయిర్ స్టైల్ తో ట్రంప్ ఏకంగా కిమ్ లాగే మారిపోయాడు” అని మరో వ్యక్తి రియాక్ట్ అయ్యాడు. “ట్రంప్ కు సూటయ్యే కొత్త హెయిర్ స్టైల్ భలేగా ఉంది” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. “ఎప్పుడూ సిరియస్ గా ఉండేవాళ్లు కూడా ఇలాంటి వీడియోలు చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈ వీడియో క్రియేట్ చేసిన వారికి నిజంగా థ్యాంక్స్” అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “సో ఫన్నీ, ట్రంప్ కు కొత్త హెయిర్ స్టైల్ చాలా బాగుంది. కిమ్ ను అలాగే వదిలేస్తే, ప్రపంచంలోని అందరు దేశాది నేతలకు తనలాగే హెయిర్ స్టైల్ మార్చేలా ఉన్నాడు” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఇద్దరు కజిన్స్ లా ఉన్నారు” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మొత్తంగా ఈ వీడియో నెట్టింట ఫుల్ ఫన్ జెనరేట్ చేస్తోంది.

Read Also: ఏం బుర్ర బ్రో.. టీవీ పాడైందా? ఇలా చీపురుతో కొట్టండి చాలు.. రిపైరింగ్ కు డబ్బులు వేస్ట్!

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×