OTT Movies : 2025 మేలో పలు మోస్ట్ అవైటింగ్ మలయాళ సినిమాలు ఓటీటీ ప్రియుల ముందుకు రానున్నాయి. కామెడీ, థ్రిల్లర్, స్పోర్ట్స్ డ్రామా జానర్‌లలో వైవిధ్యమైన కథలతో ఈ సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. మేలో రిలీజ్ కాబోతున్న ఆ మలయాళ సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
1. బ్రోమాన్స్ (Bromance)
మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, శంగీత్ ప్రతాప్, భరత్ బోపన్న ప్రధాన పాత్రలు పోషించిన ‘బ్రోమాన్స్’ మే1న ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ సోనీ లివ్ (Sony LIV) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా యూత్ ఫుల్ కామెడీ, లైట్-హార్టెడ్ అడ్వెంచర్ ఇష్టపడే వారికి ఒక రిఫ్రెషింగ్ ఎంటర్‌టైన్‌మెంట్. మలయాళం, తమిళం, తెలుగు, హిందీలో అందుబాటులో ఉంది. అరుణ్ డి. జోస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మలయాళ కామెడీ డ్రామా ఇద్దరు సోదరులు బిన్టో, శింటో చుట్టూ తిరుగుతుంది. శింటో అదృశ్యమైనప్పుడు సోషల్ మీడియాకు అలవాటైన బిన్టో తన సోదరుడి స్నేహితులతో కలిసి అతన్ని వెతుకుతాడు. ఈ అన్వేషణలో ఒక ఎథికల్ హ్యాకర్, ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్, స్థానిక గుండా చేరడంతో కథ ఒక కామెడీ అడ్వెంచర్‌గా మారుతుంది. ఈ సినిమా యూత్‌ఫుల్ ఎనర్జీ, ఫ్రెండ్‌షిప్, ఫన్ మూమెంట్స్‌తో నిండి ఉంటుంది.
2. మరణమాస్ (Maranamass)
‘మరణమాస్’ మూవీ సోనీ లివ్ (Sony LIV) ఓటీటీలో మే 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బాసిల్ జోసెఫ్ నటించిన ఈ బ్లాక్ కామెడీ, ఒక రాత్రి బస్సులో జరిగే అనూహ్య సంఘటనల చుట్టూ తిరుగుతుంది. లూక్ PP అనే టాక్సిక్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, తన ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి బస్సులోకి ఎక్కుతాడు. కానీ ఆమె ఇప్పటికే ఒక డెడ్ బాడీని దాచే సమస్యలో ఉంటుంది. ఒక సీరియల్ కిల్లర్, బస్ డ్రైవర్, కండక్టర్, ఒక పోలీస్ ఆఫీసర్ (తన కుక్కను కూడా వెతుకుతూ) ఈ గందరగోళంలో చేరడంతో ఈ రైడ్ కామెడీ, సస్పెన్స్, డార్క్ కామెడీతో ఆకట్టుకుంటుంది. డార్క్ కామెడీ, థ్రిల్లింగ్ నరేటివ్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి థ్రిల్ ఇస్తుంది. అలాగే కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా ఉంటుంది.
మేలో రిలీజ్ కానున్న మోస్ట్ అవైటింగ్ సినిమాలు
పైన చెప్పుకున్న రెండు సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని మలయాళ సినిమాల డేట్స్ ను మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ఈ సినిమాలన్నీ మేలోనే రిలీజ్ కానున్నాయి అని టాక్ నడుస్తోంది.
Read Also : రైడ్ 2 రివ్యూ… ఇవి చూశాకే సీక్వెల్స్ వద్దురా అనిపిస్తుంది
అలప్పుజ్ఞ జిమ్‌ఖానా (Alappuzha Gymkhana) – హాట్ స్టార్
బజూకా (Bazooka) – అమెజాన్ ప్రైమ్ వీడియో
తుదరం (Thudarum) – జియో హాట్ స్టార్
ఒరు జాతి జాతకం (Oru Jaathi Jathakam) – మనోరమా మ్యాక్స్