ఇంట్లో ఉన్న టీవీలు, ఫ్యాన్లు, మిక్సీలు, కుక్కర్లు తరచుగా రిపేర్ కు వస్తాయి. ఆయా కారణాలతో పని చేయవు. అలాంటి సమయంలో టెక్నీషియన్స్ ను పిలిపిస్తాం. అతడు సమస్య ఏంటో గుర్తించి రిపేర్ చేస్తాడు. మళ్లీ ఆయా వస్తువులు యథావిధిగా పని చేస్తాయి. కానీ, కొంత మంది వస్తువులను రిపేర్ చేసే విధానం చూస్తే ఆశ్చర్యంతో పాటు నవ్వు కలిగిస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏంటి అంటారా?
బాబోయ్ టీవీని ఇలా రిపేర్ చేస్తారా?
పాత కాలం డబ్బా టీవీలు ఇప్పటికీ అక్కడక్కడ దుకాణాలలో కనిపిస్తుంటాయి. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టీవీల మారిగా పిక్చర్ క్వాలిటీ లేకపోయినా, కేబుల్ కనెక్షన్ పెట్టించి ఉందా? అంటే ఉంది అన్నట్లుగా నడిపిస్తారు. షాపులో బోర్ కొట్టకుండా ఆ డబ్బా టీవీలనే చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ టీవీలు సరిగా పని చేయవు. సౌండ్ వస్తే, పిక్చర్ కనిపించదు. పిక్చర్ కనిపిస్తే సౌండ్ సరిగా రాదు. కేబుల్ కనెక్షన్ కదిలించడం, టీవీనీ కదిలించడం చేస్తే, మళ్లీ యథావిధిగా పని చేస్తాయి. కానీ, ఓ వ్యక్తి తన టీవీనీ ఎలా హద్దుల్లో పెడుతున్నాడో చూస్తే, నవ్వి నవ్వి పొట్ట చెక్కలు కావాల్సిందే!
బొమ్మ రావాలంటే చీపురుతో బాదాల్సిందే!
ఓ కిరాణా షాప్ లో ఫ్రిజ్ మీద ఓ టీవీ పెట్టారు. ఏమైందో తెలియదు గానీ, ఉన్నట్టుండి టీవీలో బొమ్మ స్ట్రక్ అయ్యింది. సాధారణంగా అయితే, టీవీ ఆఫ్ చేసి, ఆన్ చేస్తారు. కానీ, ఆ షాప్ లో ఉన్న వ్యక్తి చీపురు చేతిలోకి తీసుకొని కొట్టడం మొదలు పెట్టాడు. ఇటు సైడ్ ఓ నాలుగు దెబ్బలు, అటు సైడ్ ఓ నాలుగు దెబ్బలు కొట్టాడు. కాసేపు అలాగే కొట్టడంతో టీవీ యథావిధిగా పని చేయడం మొదలుపెట్టింది. ఆయన గారి ట్రీట్మెంట్ చూసి షాపుకు వచ్చిన వాళ్లంతా నవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Guy fixes the damn TV pic.twitter.com/B8Tb57vG47
— non aesthetic things (@PicturesFoIder) April 29, 2025
Read Also: ఇండియాలోని ఆ రాష్ట్ర ప్రజలు ఇన్ కమ్ ట్యాక్స్ పే చెయ్యక్కర్లేదు.. ఎందుకంటే?
ఫన్నీగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు
అటు ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “ఓడియమ్మా.. టీవీ రిపేర్ ఇలా కూడా చేస్తారా?” అని కామెంట్స్ చేస్తున్నారు. “ఈ విషయం తెలియక టీవీ రిపేర్ కోసం ఇన్ని డబ్బులు వేస్ట్ చేశానే” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “ఇకపై నా టీవీ రిపేర్ వచ్చినప్పుడు ఇలాగే చేస్తా” అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇలా రిపేర్ చేస్తే మూడు రోజుల్లో టీవీ మూలకు పడటం ఖాయం” అంటున్నారు మరికొంత మంది నెటిజన్లు. మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: సడెన్‌గా సూర్యుడు మాయం అయితే? భూమి ఏమవుతుందో తెలుసా?