BigTV English

Trump on Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంలోకి ట్రంప్ మామ ఎంట్రీ.. బ్యాన్ చేస్తారట!

Trump on Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంలోకి ట్రంప్ మామ ఎంట్రీ.. బ్యాన్ చేస్తారట!

Alekhya Chitti Pickles Issue: గత రెండు మూడు రోజులుగా అలేఖ్య చిట్టి పికెల్స్ ఇష్యూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. పచ్చళ్ల ధర ఎక్కువగా ఉందన్న కస్టమర్లపై అలేఖ్య నోటికొచ్చినట్లు మాట్లాడిన ఆడియోలు బయటకు రావడంతో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. కస్టమర్లే మా దేవుళ్లు అని వీడియోలలో చెప్పడం కాదు, నిజ జీవితంలోనూ అలాగే ఉండాలంటూ హితవు పలుకుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే అలేఖ్య సిస్టర్స్ వేరు, రియల్ లైఫ్ లో వేరు అంటూ మండిపడుతున్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలే తప్ప, తలపొగరుగా వ్యవహరించకూడదంటున్నారు. ఈ వివాదం నేపథ్యంలో అలేఖ్య అక్క సుమ, చెల్లి రమ్య సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్లు ఏమాత్రం కన్విన్స్ కావడం లేదు.


అలేఖ్య చిట్టి పికెల్స్ పై మీమ్స్ వరద

అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో మీమ్స్ ఏరులై పారుతున్నాయి. తమలోని క్రియేటివిటీని అంతా బయటకు తీసి అదిరిపోయే మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అలేఖ్య పికెల్స్ కొనుగోలు చేయాలంటే ఉన్న ఆస్తులు అమ్మాలంటూ కామెంట్స్ పెడుతుంటే, అలేఖ్య పికెల్స్ తినడం వల్ల భార్యకు గర్భం వచ్చింది, చెల్లికి పెళ్లి కుదిరింది అనే కామెంట్స్ పై జోరుగా జోకులు పేల్చుతున్నారు.


అలేఖ్య వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన ట్రంప్ మామా

ఇక తాజాగా మీమర్స్ ఈ వివాదంలోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను లాగారు. ఈ వివాదంపై ఏకంగా ట్రంప్ స్పందించినట్లు వీడియో క్రియేట్ చేశారు. ఏఐ సాయంతో రూపొందించిన ఈ వీడియో చూస్తే, నిజంగానే ట్రంప్ అలేఖ్య పికెల్స్ ఇన్సిడెంట్ మీద మాట్లాడారా? అన్నట్లుగా రూపొందించారు. ఇంతకీ.. ఈ వీడియోలో ట్రంప్ ఏమన్నారంటే.. “అలేఖ్య చిట్టి పికెల్ వివాదంపై స్పందించాలి అనుకుంటున్నాను. కస్టమర్ కు జరిగిన అవమానం గురించి నాకు చాలా బాధ కలిగింది. ఈ నేపథ్యంలో నేను మీతో ఓ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అలేఖ్య చిట్టి పికెల్స్ ను బాయ్ కాట్ చేయాలని పిలుపు ఇస్తున్నాను. ఈ ఇన్సిడెంట్ నుంచి వాళ్లు మంచి గుణపాఠం నేర్చుకుంటారని భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.

Read Also: ఒసేయ్.. నీకెందుకే పచ్చళ్లు.. పాచిపని చేస్కో.. అలెఖ్య మరో ఆడియో లీక్!

Read Also: అవును తిడతాం.. అలేఖ్య చెల్లి రమ్య షాకింగ్ కామెంట్స్!

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

అలేఖ్య చిట్టి పికెల్స్ ఇష్యూపై ట్రంప్ ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో.. నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “ ఈ వీడియోను ఎవరు చూసినా, నిజంగానే ట్రంప్ మాట్లాడారేమో అనుకుంటారు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “పనిలో పనిగా ప్రధాని మోడీ కూడా ఈ విషయంపై రియాక్ట్ అయితే సరిపోతుంది”  అని కామెంట్స్ పెడుతున్నారు. “కాస్త డిలే అయ్యింది కానీ, తప్పకుండా జస్టిస్ దొరికింది” అని మరో నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. మొత్తంగా పలువురు నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ ఎమోజీతో కామెంట్స్ పెడుతున్నారు.

Read Also: ఏంటీ అలేఖ్య పచ్చళ్లు తింటే.. గర్భం వస్తుందా?

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×