BigTV English

Pooja Hegde: నేనెప్పుడూ వాటికి సిగ్గుపడను.. హీరోయిన్స్‌కు పూజా హెగ్డే కొత్త సలహా

Pooja Hegde: నేనెప్పుడూ వాటికి సిగ్గుపడను.. హీరోయిన్స్‌కు పూజా హెగ్డే కొత్త సలహా

Pooja Hegde: హీరోలు మాత్రమే కాదు.. హీరోయిన్స్ కూడా ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటేనే వారి టాలెంట్ బయటపడుతుంది. ఒకే విధమైన పాత్రలు చేస్తూ వారికి వరుసగా అలాంటి అవకాశాలే వస్తుంటాయి. ఈ విషయంపై తాజాగా పూజా హెగ్డే స్పందించింది. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన పూజా హెగ్డే.. సౌత్ సినిమాలతోనే హీరోయిన్‌గా మారింది. మెల్లగా బాలీవుడ్‌లో కూడా తన అడుగుపడింది. కానీ గత కొన్నేళ్లుగా సౌత్‌పై పెద్దగా దృష్టిపెట్టకుండా బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది ఈ భామ. ప్రస్తుతం తన అప్‌కమింగ్ తమిళ మూవీ ‘రెట్రో’ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. హీరోయిన్లకు కొత్తగా ఒక సలహా ఇవ్వడానికి ముందుకొచ్చింది.


బాలీవుడ్‌కు వెళ్లిపోయింది

కొన్నేళ్ల క్రితం పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్‌ను సంపాదించుకుంది పూజా హెగ్డే. సౌత్‌లో తనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. కానీ అదే సమయంలో తను సౌత్‌ను వదిలేసి బాలీవుడ్‌పై ఫోకస్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో తను నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో, సౌత్‌లో కూడా మళ్లీ అవకాశాలు రాకపోవడంతో కాస్త వెనకబడింది. అలా కొన్నేళ్ల పూజా కెరీర్ స్లో అయినా.. మళ్లీ ఇప్పుడిప్పుడే ఫామ్‌లోకి వస్తోంది. షాహిద్ కపూర్‌కు జంటగా పూజా హెగ్డే నటించిన ‘దేవ’ మూవీ ఇటీవల విడుదలయ్యింది. అంతే కాకుండా సూర్యతో కలిసి తను నటించిన ‘రెట్రో’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బిజీ అయిపోయింది పూజా.


రిజెక్ట్ చేశారు

తాజాగా ఆడిషన్స్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది పూజా హెగ్డే. ‘‘నేను రీసెంట్‌గా ఒక తమిళ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చాను. కానీ రిజెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఆ పాత్రకు నేను చాలా యంగ్‌గా ఉంటానని వాళ్లు ఫీలయ్యారు. కాబట్టి నాకంటే పెద్దవారిని ఎంపిక చేసుకున్నారు. కానీ నేను ఎప్పుడైనా ఆడిషన్స్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉంటాను. వాటికి సిగ్గుపడను’’ అంటూ ఆడిషన్స్‌పై తనకు పాజిటివ్ అభిప్రాయం ఉందని చెప్పుకొచ్చింది. ‘‘పని మధ్యలో ఈగోలకు పోవడం కరెక్ట్ కాదు. చాలామందికి అసలు ఆడిషన్స్ ఇచ్చే అదృష్టమే దొరకదు. అందుకే అలాంటి అవకాశం వచ్చినప్పుడు వెంటనే తీసుకోవాలి’’ అని తెలిపింది.

Also Read: హీరో, హీరోయిన్ల మధ్య ఏజ్ కాదు.. అది ఉండాలి.. సల్లూ, రష్మికపై స్పందించిన హీరోయిన్

ఫారిన్‌లో అంతే

‘‘ఫారిన్ భాషల్లో పెద్ద పెద్ద స్టార్లు సైతం సినిమాలకు ఆడిషన్స్ ఇస్తారు. అదే ఇక్కడ ఎందుకు జరగకూడదు’’ అని ప్రశ్నించింది పూజా హెగ్డే (Pooja Hegde). అందుకే తను ఒక పాత్రకు కరెక్ట్ కాదా అని ఆలోచించే ముందు మేకర్సే తనను స్వయంగా ఆడిషన్స్‌కు పిలిచి తెలుసుకుంటే బాగుంటుందని తెలిపింది. అది తనకు తాను యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవడానికి కూడా పనికొస్తుందని చెప్పింది. మేకర్స్ కూడా తను ఏ పాత్ర అయినా చేయగలదు అని నమ్మించడానికి ఆడిషన్సే సరైన మార్గమని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ప్రస్తుతం పూజా హెగ్డే ఖాతాలో పలు తమిళ సినిమాలతో పాటు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. అన్నింటి కంటే ముందు ‘రెట్రో’ విడుదల కానుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×