BigTV English

Kakani Bail petition: పరుగో పరుగు.. బెయిలొచ్చేదాకా దొరికేది లేదు

Kakani Bail petition: పరుగో పరుగు.. బెయిలొచ్చేదాకా దొరికేది లేదు

అదిగో అక్కడ పండగ చేసుకుంటున్నా
ఇదిగో ఇక్కడ మనవడి నోట్లో ఉగాది పచ్చడి పెడుతున్నా..
ఆ ఫంక్షన్లో తోరణాలు కట్టించేది, కుర్చీలు వేయించేది నేనే..
ఇక్కడ కుటుంబ సభ్యులతో ఎంచక్కా ఫొటోలు దిగేదీ నేనే..


గత కొన్నిరోజులుగా మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఫేస్ బుక్ అకౌంట్లో కనపడుతున్న ఫొటోలు, వాటికి ఆయన జత చేస్తున్న వ్యాఖ్యానాలు ఇవి. కాకాణి ఎక్కడికీ పారిపోలేదు, ఇక్కడే ఎక్కడో ఉన్నారు అని జనం అనుకునేట్టుగా ఆయన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. కానీ ఆయన మాత్రం దొరకట్లేదు. నెల్లూరులో, హైదరాబాద్ లో పోలీసులు తెగ వెదుకుతున్నారు. కనపడితే నోటీసు ఇచ్చి వెళ్లిపోతాం బాబ్బాబు ఎక్కడున్నారో చెప్పండి అంటూ ఆయన బంధువుల్ని అడుగుతున్నారు. కాకాణి మాత్రం నేను సోషల్ మీడియాలో మాత్రమే కనపడతాను అంటూ రియల్ లైఫ్ లో తప్పించుకు తిరుగుతున్నారు, అవును ఆయన అజ్ఞాతవాసం గడుపుతున్నారు. కానీ ఎంతకాలం..?

బెయిలొచ్చేదాకా తప్పదు..
విచారణ పేరుతో తనను పట్టుకుంటే, అట్నుంచి అటే జైలుకి పంపిస్తారనే అనుమానం కాకాణిలో ఉంది. అందుకే ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. పారిపోయారంటే పరువు తక్కువ, అందుకే తన ఫొటోలతో లీకులు వదులుతున్నారు. ఇంతకీ కాకాణికి బెయిలొస్తుందా..? అదే ఇప్పుడు అనుమానం. కేవలం అక్రమంగా క్వారీ తవ్వకాలే కాదు, ఎస్సీ, ఎస్టీ కేసు కూడా కాకాణిపై ఉంది. ఈ కేసులో బెయిలివ్వడం కుదరదని అంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. లేదు, గతంలో ఇలాంటి కేసుల్లో బెయిలివ్వొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అంటారు కాకాణి తరపు లాయర్. చివరకు ఏపీ హైకోర్టు ఈ బెయిల్ పిటిషన్ ని సోమవారానికి వాయిదా వేసింది. దీంతో కాకాణికి మరో మూడు రోజులు అజ్ఞాతవాసం తప్పేలా లేదు.


హైదరాబాద్ లో గాలింపు

కాకాణి గోవర్దన్ రెడ్డి వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా ఆయన కనుసన్నల్లో రెచ్చిపోయిందనే ఆరోపణలున్నాయి. కానీ అప్పట్లో ఫిర్యాదు తీసుకోడానికి పోలీసులు కూడా వెనకడుగు వేశారని అంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కాకాణిపై కేసు చకచకా ముందుకు కదిలింది. ఇప్పటికే ఈ కేసులో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు, వారు రిమాండ్ లో ఉన్నారు. కాకాణి కూడా విచారణకోసం రావాలంటూ పోలీసులు నోటీసులిచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన వారికి అందుబాటులో లేకుండా తప్పించుకు తిరుగుతున్నారు. చివరకు పోలీసులు గోడలకి, గేట్లకి నోటీసులి అంటించి వచ్చేస్తున్నారు, కనపడిన బంధువుల చేతిలో పెట్టి వచ్చేస్తున్నారు. మరోవైపు బెయిల్ కోసం కాకాణి లాయర్లు హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆ బెయిలొస్తే కానీ కాకాణి బయట అడుగుపెట్టేలా లేరు. చివరకు పోలీసులు ఆయన కోసం నెల్లూరు, హైదరాబాద్ లో గాలిస్తున్నారు. కానీ ఫలితం లేదు.

కాకాణి విషయంలో ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. విచారణకు రమ్మంటే భయపడి పారిపోతే ఎలా అంటూ టీడీపీ నేతలంటున్నారు. మొత్తానికి కాకాణి మాత్రం పోలీసులకు చిక్కకుండా, దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×