Alekhya Chitti Pickles Trolling: మాట తూటా లాంటిది. ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. కొన్ని మాటలు జీవితం మీద కోలుకోలేని దెబ్బ తీస్తాయి. ప్రస్తుతం అలేఖ్య చిట్టీ పికెల్స్ వ్యవహారం ఇలాగే ఉంది. ధర ఎక్కువ అన్న పాపానికి నోటికి వచ్చినట్లుగా మాట్లాడ్డం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మగాళ్లను పర్సనల్ గా టార్గెట్ చేయడం, ఆడాళ్లను పాచి పని చేసుకోవాలంటూ కించపరచడంపై మండిపడుతున్నారు. ఇంత కాలం ఆమె తన వ్యాపారాన్ని ఏ నెటిజన్స్ మీద ఆధారపడి నిర్వహించిందో, ఇప్పుడు అదే కస్టమర్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అసలు ఏం జరిగిందో అలేఖ్య అక్క సుమ, చెల్లి రమ్య వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్లు లైట్ తీసుకుంటున్నారు. వాళ్లు చెప్పే మాటల్లో పసలేదని కొట్టి పారేస్తున్నారు.
పచ్చళ్లతో ప్రెగ్నెన్సీ వస్తుందా?
ఇక అలేఖ్య తన పచ్చళ్ల వ్యాపారాన్ని విస్తరించుకునేందుక చీప్ ట్రిక్స్ ప్లే చేసిందనే విమర్శలు ఉన్నాయి. అదేదో మహేష్ బాబు సినిమాలో తమన్నా ఫ్యామిలీ అమ్మే స్వీట్స్ తింటే లోకంలో లేని లాభాలు కలిగినట్లు.. అలేఖ్య పికెల్స్ తిన్న వారికి ఏకంగా ప్రెగ్నెన్సీలు రావడం, పెళ్లిళ్లు కుదరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తన బిజినెస్ ను పెంచుకునేందుకు కొంత మందికి డబ్బులు ఇచ్చి ఫేక్ కామెంట్స్ పెట్టించుకుంటుందని పలువురు విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా రెండు కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. “మీ రొయ్యల పచ్చడి తిన నా భార్యకు గర్భం వచ్చింది. స్వచ్ఛమైన నాన్ వెజ్ ఊరగాయలు అందిస్తున్న అలేఖ్య పికెల్ వారికి ధన్యవాదాలు” అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. దీనికి అలేఖ్య సిస్టర్ రమ్య “రియల్లీ?? కంగ్రాట్స్, సో హ్యాపీ ఫర్ యు” అంటూ రిప్లై ఇచ్చింది. అటు మరో కస్టమర్ “మీ పికెల్ తిన్న వెంటనే మా చెల్లికి పెళ్లి ఫిక్స్ అయ్యింది మేడం. అందరూ అలేఖ్య చికెన్ పికెల్స్ కొనండి” అని కామెంట్ పెట్టింది. ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
Read Also: పచ్చళ్లు అమ్ముకోండి పర్వాలేదు.. ఆ పచ్చి బూతులు ఎందుకమ్మా?
Alekhya Chitti pickle part 2 🌚#alekhyachittipickles 🌝 pic.twitter.com/7RzVlMHDFB
— cskian (@Rahulcskain) April 4, 2025
Orey entra idhii 1 hr navvu kuna raa😂😂😂😂😂😂😂😂#alekhyachittipickles pic.twitter.com/anfRXQk8Jm
— HarshaVardhan🐉 (@HarshaVardhan3_) April 4, 2025
Appudu direct ga, roju intlo ne vadini amma na buthulu tittachuuuu, pic.twitter.com/ofLlL0xUXY
— Sandhya Reddy YSCRP 🇱🇸 (@SandhyaSamayam) April 4, 2025
Alekhya Chitti Pickles కొన్న వాళ్ళు అందరూ బాగవలేదు అంటున్నారు .. వాళ్ళ Pickless సేల్ అవడానికి కారణం ….#AlekhyaChittiPickles pic.twitter.com/hTDlGPa1Gv
— Trivikram (@Trivikram_Pavan) April 2, 2025
Life time motivatio akka 😂#alekhyachittipickles
pic.twitter.com/mC0Q5kZ0VO— tfi_banisa 🔥 (@Sandeep_shannu) April 3, 2025
Min koteswarudu ayi undali 😂🤧#alekhyachittipickles pic.twitter.com/Flqf7nNC9T
— 𝙐𝙙𝙖𝙮❤️🔥 (@PRabby86155) April 3, 2025
Time to post original.. version!#alekhyachittipickles 😂🤣 https://t.co/OdMxAHdzbS pic.twitter.com/MsZAjsGIGA
— Manoj! (@DMKtweetz) April 3, 2025
Read Also: ఒసేయ్.. నీకెందుకే పచ్చళ్లు.. పాచిపని చేస్కో.. అలెఖ్య మరో ఆడియో లీక్!
అలేఖ్య పికెల్స్ ను ఆటాడేసుకున్న మీమర్స్
ఇక ఈ కామెంట్స్ ను చూసి నెటిజన్లు, మీమర్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ పెట్టారు. వారి కామెంట్స్ ను షేర్ చేస్తూ.. కొంత మంది ఫన్నీగా కామెంట్స్ పెడుతుంటే, మరికొంత మంది వెకిలిగా కామెంట్స్ చేస్తున్నారు. “రొయ్య పచ్చడి తింటే ప్రెగ్నెన్సీ వచ్చిందా? అంటే రొయ్య కxపు చేసిందా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. “రొయ్య పచ్చడి తిని గర్భం వచ్చిందంటే.. తొమ్మిది నెలల తర్వాత రొయ్య పుడుతుందేమో?” అని మరికొంత మంది ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “మీద దగ్గర మ్యాటర్ లేకపోయినా, మీ భార్య ప్రెగ్నెంట్ కావాలంటే.. ఆలేఖ్య చిట్టి పికెల్స్ నుంచి రొయ్యల పచ్చడి ఆర్డర్ పెడితే సరిపోతుంది” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. అటు అలేఖ్య చిట్టి పికెల్స్ చికెన్ పచ్చడి తిన్న వెంటనే తన చెల్లికి పెళ్లి ఫిక్స్ అయ్యిందన్న కామెంట్ పైనా నెటిజన్లు జోరుగా ట్రోల్స్ చేస్తున్నారు.
Read Also: అవును తిడతాం.. అలేఖ్య చెల్లి రమ్య షాకింగ్ కామెంట్స్!