Alekhya Chitti Pickles Ramya: అలేఖ్య చిట్టి పికెల్స్ ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో చేసిన రచ్చ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. పచ్చళ్లు చాలా ఎక్స్ పెన్సివ్ అన్న పాపానికి కస్టమర్లపై నోరేసుకు పడిపోయింది అలేఖ్య. ఆమె మాట్లాడిన బూతులు నెట్టింట తెగ వైరల్ కావడంతో నెటిజన్లు అలేఖ్య సిస్టర్స్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు. సుమారు నెల రోజుల పాటు సోషల్ మీడియా అంతా అలేఖ్య సిస్టర్స్ రచ్చే కొనసాగింది. గత కొంత కాలంగా వీరి మీద వచ్చినన్ని మీమ్స్ మరెవరి మీద రాలేదని చెప్పుకోవచ్చు. నెటిజన్ల ట్రోలింగ్ దెబ్బకు అలేఖ్య చిట్టి పికెల్స్ దుకాణం మూత పడింది. అలేఖ్య డిప్రెషన్ లోకి వెళ్లి హాస్పిటల్ పాలైనట్లు ఆమె సిస్టర్స్ సుమ, రమ్య చెప్పుకొచ్చారు.
కొత్త బిజినెస్ తో ఎంట్రీ ఇస్తున్న అలేఖ్య సిస్టర్స్
అలేఖ్య చిట్టి పికెల్స్ కథ ముగిసిన అధ్యాయం కావడంతో ఇప్పుడు అలేఖ్య చెల్లి ఈ వ్యాపారాన్ని భుజానికి ఎత్తుకోబోతున్నట్లు వెల్లడించింది. రీసెంట్ గా తన కొత్త బిజినెస్ గురించి ఆమె ఓ వీడియోను వదిలింది. 11 నెలలుగా ఎంతో అభివృద్ధి చెందిన అలేఖ్య చిట్టి పికెల్స్ బిజినెస్ మొత్తం క్లోజ్ అయ్యిందని వెల్లడించింది. అదే బిజినెస్ ను కొత్త పేరుతో తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ‘రమ్య మోక్ష పికెల్స్’ పేరుతో పచ్చళ్ల వ్యాపారాన్ని కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఇక తమ పికెల్స్ ఇప్పటి నుంచి సామాన్యులకు అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చింది. తన అక్క రమ్య ఇన్వాల్వ్ మెంట్ లేకుండా పూర్తిగా తన ద్వారా ఈ బిజినెస్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పింది.
మళ్లీ అందాల ఆరబోత మొదలుపెట్టిన రమ్య
వాస్తవానికి ఈ ముగ్గురు సిస్టర్స్ ముందుగా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా చిన్న అమ్మాయి రమ్య తన అందచందాలతో రీల్స్ చేస్తూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఆమె వేసే డ్యాన్సులు, చేసే రీల్స్ చూసి ఫిదా అయ్యారు. ఫాలో వర్స్ పెరిగిన తర్వాత నెమ్మదిగా పికెల్స్ వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పుడు కొత్త బిజినెస్ మొదలుపెడుతున్న నేపథ్యంలో మళ్లీ అందాల ఆరబోతకు తెరలేపింది. చీరలో సోకుల విందు చేస్తూ వీడియోలను షేర్ చేస్తోంది. ప్రస్తుతం వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు రమ్యతో పాటు వారి సిస్టర్స్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “కొంచెం సిగ్గు ఉన్నా, ఇంత జరిగాక కాస్త పద్దతి మార్చుకుంటారు. మళ్ళీ వీళ్లు దరిద్రం 2.0తో వస్తున్నారు. అది వీళ్ల తప్పు కాదు. వీళ్ల పెంపకం తప్పు. పచ్చళ్ల బిజినెస్ చేస్తానని చెప్పే ఈమె ఈ రేంజ్ ఎక్స్ పోజింగ్ చేయడం అవసరమా? మనుషుల వీక్ నెస్ తో బిజినెస్ చేసే వాళ్లు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. ఎప్పుడో ఒకసారి బోల్తా కొట్టడం ఖాయం. ఈమె వీడియోలను చూసి ఇంట్లో వాళ్లు కూడా సైలెంట్ గా ఉంటున్నారంటే.. వాళ్లు ఎలాంటి వాళ్లో అర్థం చేసుకోవచ్చు. వీళ్లను ఎంకరేజ్ చేసే మగాళ్లు ముందుగా మారండి. ఆ తర్వాతే వీళ్లు మారుతారు. ఇంత జరిగినా వీళ్లు సిగ్గు, శరం వదిలేసినట్లే కనిపిస్తోంది” అని ఓ నెటిజన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Read Also: యువతిపై చెయ్యేసిన కామాంధుడు, వీపు విమానం మోత మోగించిన మహిళలు!