BigTV English

Plastic: ప్లాస్టిక్ బాక్సుల్లోని ఫుడ్‌తో క్యాన్సర్ రిస్క్?

Plastic: ప్లాస్టిక్ బాక్సుల్లోని ఫుడ్‌తో క్యాన్సర్ రిస్క్?

Plastic : ప్లాస్టిక్.. ఇటీవల నిత్య జీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్ పర్యావరణానికి పెను సవాలు విసురుతోంది. తక్కువ మందం కలిగిన వీటిని తిరిగి ఉపయోగించే అవకాశం లేదు. మట్టిలో కలిసిపోవడానికి దశాబ్ధాల సమయం పడుతోంది. అడ్డూ అదుపూ లేకుండా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు. ఎక్కడ చూసిన ప్లాస్టిక్ వ్యర్ధాలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తుండడం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు తప్పదని పరిశోధకులు పదే పదే హెచ్చరిస్తున్నారు. అయిన ప్రజలు అర్థం చేసుకోవడం లేదు..


నిత్య జీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్

వేడి ఆహార పదార్థాల కోసం ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించడం హానికరం. వేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ పాత్రలలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఉంచకూడదు. ముఖ్యంగా వేడి అన్నాన్ని ప్లాస్టిక్ కంటైనర్‌లో ఉంచితే ప్రాణానికే ప్రమాదం. ప్లాస్టిక్ కంటైనర్లకు అలవాటు పడి చాలా మంది లంచ్‌, డిన్నర్‌లకు వీటిని వినియోగిస్తున్నారు. బియ్యాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేస్తే అది విషంగా మారుతుంది. వేడి వల్ల ప్లాస్టిక్ కంటైనర్ల లోపల అఫ్లాటాక్సిన్లు, మైకోటాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటాయి. ప్లాస్టిక్ కంటైనర్లలో అన్నం నిల్వ చేయడం అందుకే మానుకోవాలి.


ప్లాస్టిక్‌తో క్యాన్సర్ ముప్పు

ఇదిలా ఉండగా.. ప్లాస్టిక్ వినియోగం విషయంలో చాలామందికి ఈ సందేహం ఉంటుంది. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని అనేక నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ప్లాస్టిక్చ, క్యాన్సర్ మధ్య గల సంబంధాన్ని పరిశీలిస్తే.. ప్లాస్టిక్ తయారీలో వాడే రసాయన సమ్మేళనాలు ఇందుకు కారణమవుతున్నాయి. ప్లాస్టిక్ తయారీ పరిశ్రమల్లో ఈ సమ్మేళనాలు గ్యాస్ రూపంలో బయటకు వస్తాయి. వాటిని పీల్చినప్పుడు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఇక మన రోజువారీ జీవనశైలిలో పుడ్ గ్రేడ్ కాని ప్లాస్టిక్ వస్తువుల్లో వేడి పదార్థాలను ఎక్కువసేపు ఉంచి వాటిని తీసుకున్నప్పుడు కొంత ప్లాస్టిక్ కరిగి జీర్ణకోశంలోకి ప్రవేశించే అవకాశం ఉందంటున్నారు.

ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి

ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్‌లో ఉంచిన తర్వాత దానిని మళ్లీ వేడి చేయవద్దు. దాన్ని మళ్ళీ ఉడికించడం సురక్షితం కాదు. ప్లాస్టిక్ ఒక నిర్దిష్ట రకమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది. దీనివల్ల ఆహారంలోని పోషక విలువలు తగ్గుతాయి. వేడి లేదా వండిన ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేయడం మంచిది కాదు. కానీ చల్లని, పొడి ఆహారాన్ని నిల్వ చేయొచ్చు. కానీ అది ఆ ప్లాస్టిక్ కంటైనర్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ప్లాస్టిక్ పాత్రలో వేడి నీటిని కూడా ఉంచకూడదు. ప్లాస్టిక్ వేడెక్కినప్పుడు అది రసాయనాలను విడుదల చేస్తుంది. వేడి నీరు కూడా అదే ప్రతిచర్యలకు కారణమవుతుంది.

Also Read: ఒత్తయిన జుట్టు కావాలా? మందార పువ్వుతో ఈ హెయిర్ జెల్ ట్రే చేయండి

ప్లాస్టిక్ నివారణ:

ఏ రకంగా అయినా సరే ప్లాస్టిక్ వినియోగానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉన్నప్పుడే ఇటు క్యాన్సర్, అటు ఇతర అనారోగ్యాల ముప్పును తగ్గించుకోవచ్చు. ప్లాస్టిక్ వినియోగంపై దృష్టి సారించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా కఠిన చర్యలు తీసుకోవాలి.

 

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×