దేశంలో నిత్యం ఎంతో మంది బాలికలు, మహిళలు కామాంధులకు చేతికి చిక్కి బలైపోతున్నారు. దేశంలో ప్రతి పావు గంటలకు ఓ మహిళ అత్యాచారానికి గురవుతున్నట్లు నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. వీరిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలే ఉన్నారు. పనికి వెళ్లిన దగ్గరే ఎక్కువగా అఘాయిత్యాలకు గురవుతున్నారు. ఇవి లెక్కలోకి వచ్చిన కేసులో రోజు సుమారు 100 ఉంటున్నాయి. లెక్కలోకి రాని కేసులు ఇంకా ఎక్కువగా ఉంటాయి.
కామాంధుడికి మహిళలల దేహశుద్ధి
తాజాగా ఓ కామాంధుడికి మహిళలంతా కలిసి దేహశుద్ధి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కర్రలు, రాళ్లతో అతడిని చితకబాదినట్లు వీడియోలో కనిపించింది. ఇంతకీ అతడిని ఎందుకు కొట్టారంటే? రీసెంట్ గా కొంత మంది మహిళలు పని కోసం వెళ్లారు. ఈ గుంపులో ఓ యువతి కూడా ఉంది. అందరూ కలిసి పని చేస్తుండగా, యజమాని సదరు బాలికపై చెయ్యి వేశాడు. అసభ్యకరంగా తాకాడు. లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ విషయాన్ని గమనించిన మిగతా మహిళలు కోపంతో రగిలిపోయారు. అక్కడ ఉన్న వాళ్లంతా ఒక్కటై ఆ కామాంధుడి పని బట్టారు. అందరూ కలిసి కింద పడేసి చితక బాదారు. చేతికి ఏది దొరికితే దానితో కొట్టారు. కొంత మంది రాళ్లు విసిరితే, మరికొంత మంది కిందపడేసి కర్రలో దాడి చేశారు. చేసిన పనికి తగిన ప్రాయశ్చితం చేశారు. మహిళల దెబ్బలకు తట్టుకోలేక, ఆహాకారాలు చేశాడు. అయినా, విడువకుండా చితక్కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటన ఎప్పుడు? ఎక్కడ జరిగింది? అనే విషయాలు మాత్రం తెలియదు.
A Man In India Was Caught Red Handed Touching A Minor! Reports Show The Women Then Beat Him Senseless pic.twitter.com/DcgNeDTyRg
— FIGHTHUB (@Fighthub_x) April 15, 2025
Read Also: గంగా నదిలో రీల్స్.. కొట్టుకుపోయిన మహిళ.. అయ్యో పాపం!
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఇక ఈ వీడియోను చూసి సదరు వ్యక్తిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇండియా అంతటా ఇదే చైతన్యం రావాల్సిన అవసరం ఉంది” అని కామెంట్స్ పెడుతున్నారు. “జీవితంలో మళ్లీ మహిళల జోలికి వెళ్లాలంటేనే వణుకు పుట్టేలా చేశారు” అని మరికొంత మంది అభిప్రాయపడ్డారు. “టీమ్ వర్క్ అద్భుతంగా ఉంది” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. “చాలా కాలంగా ఆ మహిళలు హింసను ఎదుర్కొని ఉన్నట్లు అర్థం అవుతోంది. ఇప్పటికైనా వాళ్లు తిరగబడటం మంచి పరిణామం. ఇకపై అందరూ అలాగే కలిసికట్టుగా ఉండాలి” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. “వెల్ డన్ లేడీస్. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ ఘటనపై పోలీసులు తక్షణం స్పందించాలని మరికొంత మంది కోరుతున్నారు. పనికి వచ్చిన మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే.. కామంతో కళ్లు మూసుకుపోయిన వాళ్ల కళ్లు తెరుచుకుంటాయంటున్నారు. వీడియో చూస్తుంటే ఈ ఘటన నార్త్ స్టేట్స్ లో జరిగినట్లు అర్థం అవుతోంది.
Read Also: ‘బాహుబలి’ కిలికిలి భాష ఎక్కడిదో తెలిసిపోయింది.. దమ్ముంటే వీరి పేర్లు మళ్లీ తిరిగి చెప్పండి!