BigTV English

Migraine: మైగ్రేన్‌ను తగ్గించే.. బెస్ట్ టిప్స్ ఇవే !

Migraine: మైగ్రేన్‌ను తగ్గించే.. బెస్ట్ టిప్స్ ఇవే !

Migraine: మైగ్రేన్ అనేది ఎంత తీవ్రమైన తలనొప్పి అంటే, దీనితో బాధపడేవారికి మాత్రమే బాధ అర్థం అవుతుంది. ఒకసారి మైగ్రేన్ వస్తే, అది చాలా రోజుల పాటు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల మైడ్రేన్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


యోగా:
యోగా మన మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు.. మైగ్రేన్ సమస్యను తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది. మైగ్రేన్ యొక్క సమయం, తీవ్రతను ఇది తగ్గిస్తుంది. మీకు మైగ్రేన్ సమస్య ఉంటే.. మీరు క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయాలి. మీకు సమయం లేదని అనిపిస్తే.. తరచుగా కొంచెం లోతుగా శ్వాస తీసుకొని గాలిని వదులడం అలవాటు చేసుకోండి. దీంతో పాటు.. శవాసన, బ్రిడ్జ్ పోజ్ కూడా మైగ్రేన్‌ను నివారించడంలో సహాయపడతాయి. మీరు ఇలా రోజులో 20 నుండి 30 నిమిషాలు చేస్తే.. మైగ్రేన్‌ను చాలా వరకు అధిగమించగలుగుతారు.

బాదం నూనె:
మైగ్రేన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే.. ఈ చిన్న నివారణ మీకు ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ అర టీస్పూన్ బాదం నూనెను గోరువెచ్చని పాలతో కలిపి తీసుకుంటే.. మైగ్రేన్ లక్షణాలను తగ్గించుకోవచ్చు. కానీ మీరు పాలలో బాదం నూనె కలిపి తాగడంలో ఇబ్బంది పడుతుంటే.. మీరు దానిని డ్రాపర్ సహాయంతో ముక్కులో కూడా వేసుకోవచ్చు. దానిలో ఒక్క చుక్క వేస్తే సరిపోతుంది. బాదంలో ఫైబర్, ప్రోటీన్, కొవ్వు, విటమిన్ E, మాంగనీస్ , మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం ఆక్సైడ్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల దాదాపు అన్ని రకాల మైగ్రేన్‌లను నివారించవచ్చు. మీరు దానితో మీ తల, అరికాళ్ళను మసాజ్ చసుకోవచ్చ. ఇలా చేయడం వల్ల మైగ్రేన్ నయమవుతుంది. అంతే కాకుండా మీరు బాగా నిద్రపోతారు కూడా. బాదం నూనె లాగానే.. ఆవు పాలతో పాటు 2-3 చుక్కల నెయ్యిని ముక్కులో వేసుకుంటే, అది మైగ్రేన్‌ను కూడా నయం చేస్తుంది.


ధ్యానం, సంగీతం:
కళ్ళు మూసుకుని కొంతసేపు మౌనంగా కూర్చోండి. ఈ సమయంలో మీరు కొంత జపం కూడా చేయవచ్చు. ఇదే కాకుండా.. కొంతకాలం మంచి సంగీతం వినడం అలవాటు చేసుకోండి. ఇది ఒత్తిడి , ఆందోళన నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది మైగ్రేన్ లక్షణాలను తగ్గించడంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ధ్యానాన్ని కూడా మైండ్‌ఫుల్‌నెస్‌గా పరిగణిస్తారు. ఇది ఒక మానసిక ప్రక్రియ. ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తి వర్తమానంలో జీవించడానికి సహాయపడుతుంది. మనిషి రేపటి గురించి.. గతం గురించి తక్కువగా ఆలోచిస్తాడు. మీరు ఆందోళనను తగ్గించుకున్నప్పుడు.. మాత్రమే మైగ్రేన్‌ను నియంత్రించవచ్చు. జీవితం పట్ల సానుకూల దృక్పథం అలవరచుకోవడం చాలా మంచిది.

ఆక్యుప్రెషర్:
మైగ్రేన్‌కు ఆక్యుప్రెషర్ కూడా ప్రభావవంతంగా ఉంటుంది. చికిత్సలో, నొప్పి , ఇతర లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి నరాలలోని అడ్డంకులను తొలగించడానికి నిర్దిష్ట అక్యుపంక్చర్ పాయింట్లపై బొటనవేలు, వేళ్లు , చేతుల సహాయంతో ఒత్తిడిని ప్రయోగిస్తారు. దీనివల్ల శరీరంలో శక్తి ప్రవాహం జరుగుతుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆక్యుప్రెషర్ వల్ల ఎటువంటి  సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×