Alekhya Pickles Controversy: అలేఖ్య చిట్టీ పికెల్స్ వివాదం సర్దుమణుగుతున్న సమయంలో ఆమె సిస్టర్ రమ్య గోపాల్ మరో వీడియోను విడుదల చేసింది. తమ మతం గురించి జరుగుతున్న ట్రోలింగ్ పై ఆవేదన వ్యక్తం చేసింది. చనిపోయిన తమ తండ్రి ఆత్మకు కూడా శాంతి లేకుండా చేస్తున్నారని బాధపడింది. ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్లు పూజించవచ్చని, అందరూ దేవుళ్లు సమానమే అని చెప్పుకొచ్చింది. “చాలా మంది మతం పేరుతో మా మీద ట్రోల్స్ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వీళ్ల మతాన్ని దాచిపెడుతూ బిజినెస్ రన్ చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు. ఇన్ని రోజులు మాకు తెలియకు బాగానే కవర్ చేశారు అంటున్నారు. దాని గురించి ఓ చిన్న క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది.
నాన్న అలా.. మేం ఇలా..
“మా తల్లిందండ్రుల వైపు అందరూ హిందువులే. నేను కూడా హిందువునే. ప్రతి కుటుంబలో ఎవరికి నచ్చిన ఇష్ట దైవాన్ని కొలిచే హక్కు వారికి ఉంటుంది. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. మా నాన్నకు పర్సనల్ గా జీసస్ అంటే ఇష్టం. ఆయన బతికి ఉన్న సమయంలో మాతో ఒక మాట చెప్పేవారు. నా అంత్యక్రియలు నేను నమ్మిన దేవుడి ప్రకారమే చేయాలని కోరారు. అప్పుడే నాకు విముక్తి కలుగుతుందనేవారు. ఆయన ఇష్ట ప్రకారమే చేశాం. కానీ, ఇప్పుడు ఆ ఫోటోను పట్టుకుని వీళ్లు గొర్రె బిడ్డలు అని మెన్షన్ చేస్తున్నారు. మా నాన్నకు ఆ దేవుడంటే ఇష్టం. నాకు మరో దేవుడి పట్ల భక్తి ఉంది. సమాధి ఫోటోను కూడా తీసుకెళ్లి ట్రోల్ చేసేంత దిగజారుడు తనం ఎందుకు? మా ఇంట్లో అందరి పేర్లు హిందువుల పేర్లే. మా నాన్న పేరు కూడా వేణు గోపాల స్వామి. కొన్ని వ్యక్తిగత కారణాల ఆయన జీసస్ ను నమ్ముకున్నారు. అందుకే, ఆయన అంతిమ సంస్కారాలు అలా చేశాం” అని రమ్య వివరించింది.
అందరు దేవుళ్లు సమానమే!
“ఇప్పుడు మా అక్క హెల్త్ బాగా లేదు. ఆమెకు మంచి జరగాలని దేవుడి దగ్గర పూజించిన దారం తీసుకొచ్చి మా చేతికి కట్టారు. ఆ దేవుడు, ఈ దేవుడు అనే తేడా లేదు. నాకు అందరూ సమానమే. మరెందుకు మమ్మల్ని గొర్రె బిడ్డలు అని ట్రోల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రతి దేవుడు మంచి వారే. దైవంలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనేది ఉండదు. ఎవరి నమ్మకం వారిది. ఎవరినీ కించపరచకూడదు అనేది నా అభిప్రాయం. మా అక్క పెళ్లి కూడా హిందూ సంప్రదాయం ప్రకారమే జరిగింది. గత ఏడాది నా జీవితంలో మంచి జరిగింది. తిరుపతికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాను. రీసెంట్ గా మా నాన్న చనిపోవడం వల్ల తిరుపతికి వెళ్లలేకపోయాను. ప్రతి రోజు నేను జిమ్ కు వెళ్లే సమయంలో రెండు ఆవులకు ఫుడ్ కూడా పెడతాను. నేను వెళ్లేంత వరకు అవి అక్కడే వెయిట్ చేస్తాయి. ఆవులకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి మా బిజినెస్ కోసం మతాన్ని దాచుకుంటున్నామని చెప్పడం అది చాలా తప్పు. గతంలో చాలా ఆలయాలకు వెళ్లి వీడియోలను కూడా చేశాను. పచ్చళ్ల బిజినెస్ మొదలుపెట్టి ఏడాది కూడా పూర్తి కాలేదు. మా మతాన్ని దాచుకోవాల్సిన అవసరం మాకు లేదు. దయచేసి మా మీద ట్రోలింగ్ ఆపాలని కోరుతున్నాను” అని రమ్య రిక్వెస్ట్ చేసింది.
Read Also: ఐసీయూలో చిట్టీ పికెల్స్ అలేఖ్య.. కండీషన్ ఎలా ఉందంటే?