Union Minister Grand Daughter Murder: దేశంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. బిహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి దారుణ హత్యకు గురైంది. టెటువా గ్రామం అటారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమెను స్వయంగా తన భర్త రమేష్ సింగ్ కాల్చి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు రమేష్ సింగ్ తన భార్యను చంపడానికి కారణం ఏంటి..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం రమేష్ సింగ్ పరారీలో ఉన్నాడు. దీనిపై మరింత సమచారం తెలియాల్సి ఉంది.
భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న గొడవలే ఈ దారుణ హత్యకు కారణం కావొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. 14 ఏళ్ల క్రితం కేంద్ర మంత్రి మాంఝీ మనుమరాలు సుష్మా దేవి ప్రేమించి రమేష్ సింగ్ ను అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. అప్పటినుంచి వీరు బిహార్‌లోని గయా జిల్లా టెటువా గ్రామంలోనే ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, గడిచిన కొన్ని రోజులుగా వీరి దాంపత్య జీవితంలో గొడవలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ALSO READ: AP News : మహిళల న్యూడ్ వీడియోస్.. డాక్టర్‌ను చితక్కొట్టి..
రోజురోజుకీ ఆ గొడవలు మరింత ముదరడంతో ఈ రోజు తీవ్ర ఆగ్రహానికి గురైన రమేష తన ఇంట్లో దాచుకున్న గన్ తో తన భార్య సుష్మా దేవిని కాల్చి దారుణంగా చంపేశాడు. వెంటనే స్థానికులు పోలీసులు సమాచారం అందజేశారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న రమేష్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సుష్మా దేవిని ఆమె భర్తే కాల్చి చంపాడని, ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ టీమ్, టెక్నికల్ సెల్ సహాయంతో ప్రూఫ్స్ సేకరిస్తున్నామని, నిందితుడిని వీలైనంత త్వరలోనే పట్టుకుంటామని గయా జిల్లా పోలీస్ అధికారి ఆనంద్ కుమార్ చెప్పారు. సుష్మా దేవి మృతిపై ఆమె సోదరి పూనమ్ కుమారి విచారం వ్యక్తం చేశారు.
నిందితుడు రమేష్ ను కఠినంగా శిక్షించాలని సుష్మా దేవి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రమేశ్ సడెన్ గా ఇంట్లోకి వచ్చి అందరూ చూస్తుండ గానే సుష్మా దేవిని బలవంతంగా గదిలోకి తీసుకెళ్లాడని, ఆ తర్వాత ఆమెను కాల్చిచంపి పరారైనట్టు తెలిపారు. నిందితుడికి పోలీసులు కఠిన శిక్ష విధించాలని వారు కోరారు. అయితే, ఆమెపై అనుమానంతో గత కొన్నాళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ దారుణ హత్యకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: RFCL Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు.. రూ.1,00,000 పైగా వేతనం.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..
ALSO READ: NPCIL Recruitment: ఎన్‌పీసీఐఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతో జాబ్.. జీతమైతే రూ.74,000